AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motorola Edge 20: మార్కెట్లలోకి సరికొత్త మోటరోలా స్మార్ట్‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!

Motorola Edge 20: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను..

Motorola Edge 20: మార్కెట్లలోకి సరికొత్త మోటరోలా స్మార్ట్‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!
Motorola Edge 20
Subhash Goud
|

Updated on: Aug 23, 2021 | 4:43 PM

Share

Motorola Edge 20: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మొబైల్‌ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి పలు మొబైల్‌ తయారీ కంపెనీలు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా తయారు చేస్తూ విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ ఉత్పత్తుల తయారీదారు లెనోవో కంపెనీకి చెందిన మోటరోలా భారత మార్కెట్లలోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అదే మోటరోలా ఎడ్జ్‌ 20. మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. మోటరోలా ఎడ్జ్‌ 20 స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లలోకి ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్టు అమ్మకాలను జరపనుంది.

మోటరోలా ఎడ్జ్‌ 20 ను ఆగస్టు 24 న, మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ను ఆగస్టు 27న సేల్‌ చేయాలని మోటరోలా భావించింది. కాగా ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఓకే రోజున అంటే ఆగస్టు 24 రోజున ఫ్లిప్‌కార్ట్‌లో ప్రి-బుకింగ్స్‌ జరిపేందుకు మోటరోలా నిర్ణయం తీసుకుంది. మోటరోలా ఎడ్జ్‌ 20( 8GB RAM + 128GB) ధర రూ. 29,999 ఉండగా, మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ (6GB RAM + 128GB) ధర రూ. 21,499 గా నిర్ణయించింది.

మోటరోలా ఎడ్జ్‌ 20 స్పెసిఫికేషన్లు:

► ఆండ్రాయిడ్ 11 విత్‌ మైయూఎక్స్‌ సపోర్ట్‌

► 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్స్) ఓఎల్‌ఈడీ మాక్స్ విజన్ డిస్‌ప్లే

► ఆక్టా-కోర్ క్వాలకం స్నాప్‌ డ్రాగన్ 778జీ

► 8జీబీ ర్యామ్‌+128 జీబీస్టోరేజ్‌

► ట్రిపుల్ రియర్ కెమెరా (108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌,+8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్+16 మెగాపిక్సెల్ సెన్సార్‌)

► 32 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా

► 4000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ

► 30 వాట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. టైప్‌ సీ చార్జర్‌, 5జీ సపోర్ట్‌

Income Tax Refund: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. రూ.50వేల కోట్ల రీఫండ్‌.. డబ్బులు వచ్చాయా.? లేదా తెలుసుకోండిలా!

RBI New Guidelines: ఆర్బీఐ కొత్త నిబంధనలు రానున్నాయ్‌.. ఇకపై కార్డు వివరాలు గుర్తుపెట్టుకోవాల్సిందే..!

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌