RBI New Guidelines: ఆర్బీఐ కొత్త నిబంధనలు రానున్నాయ్‌.. ఇకపై కార్డు వివరాలు గుర్తుపెట్టుకోవాల్సిందే..!

RBI New Guidelines: బ్యాంకింగ్‌ వ్యవస్థలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అప్పుడప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల విషయాల్లో కూడా..

RBI New Guidelines: ఆర్బీఐ కొత్త నిబంధనలు రానున్నాయ్‌.. ఇకపై కార్డు వివరాలు గుర్తుపెట్టుకోవాల్సిందే..!
Rbi New Guidelines
Follow us

|

Updated on: Aug 22, 2021 | 4:57 PM

RBI New Guidelines: బ్యాంకింగ్‌ వ్యవస్థలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అప్పుడప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల విషయాల్లో కూడా నిబంధనలు మార్పులు చేస్తుంటుంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మోసాలను నివారించేందుకు ఆర్బీఐ పలు నిబంధనలు మారుస్తూ ఉంటుంది. సాధారణంగా క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల నుంచి లావాదేవీలు జరిపేటప్పుడు సీవీవీ నెంబర్‌ గుర్తించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందుగానే మనం కార్డు వివరాలు నమోదు చేసుకుని ఉంటాము కాబట్టి. సీవీవీ నెంబర్‌తో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోయేది. కానీ ఆర్బీఐ నిబంధనలు మార్పుల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సారి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుపై ఉండే 16 అంకెల నంబర్లను గుర్తించుకోవాల్సి ఉంటుంది. కేవలం నంబర్లే కాదు గడువు తేదీ, సీవీవీ వంటివీ కూడా గుర్తు పెట్టుకోవాలి. డేటా స్టోరేజీకి సంబంధించి ఆర్‌బీఐ త్వరలోనే నిబంధనలను మార్పు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, పేమెంట్‌ సంస్థలను ఉపయోగించి ఒకసారి మనం క్రెడిట్‌, డెబిట్‌ కార్డుతో పేమెంట్ చేస్తే మరోసారి లావాదేవీ జరిపేటప్పుడు కేవలం సీవీవీ, ఓటీపీ ఎంటర్‌ చేస్తే సరిపోయేది. ఒకసారి పేమెంట్‌ చేశాక మన కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా డేటా బేస్‌లో స్టోర్‌ అయ్యేవి. అయితే.. ఆర్థిక మోసాలను అరికట్టేందుకు డేటా స్టోరేజీకి సంబంధించి నిబంధనలను ఆర్‌బీఐ మార్చనుందని తెలుస్తోంది. దీని ప్రకారం ఇకపై ఇ -కామర్స్‌ సంస్థలు, పేమెంట్‌ అగ్రిగేటర్లు కార్డు వివరాలను స్టోర్‌ చేయడానికి వీలుండదు. అంటే లావాదేవీ జరిపే ప్రతిసారీ కార్డు వివరాలన్నీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, జొమాటో వంటి కంపెనీలు ఈ రూల్స్‌ను వ్యతిరేకించాయి. దీనివల్ల డిజిటల్‌ పేమెంట్లపై ప్రభావం పడుతుందని వాదించాయి. అయినా, ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని కొట్టిపారేసింది. త్వరలో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అందుకే ఇక నుంచి కార్డుపై ఉన్న నెంబర్లే కాకుండా సీవీవీ వివరాలు గుర్తించుకోవాలి. లేదంటే ప్రతీసారి ఆ వివరాలన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకటి, లేదా రెండు కార్డులున్నవారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎక్కువ కార్డులున్న వారికే ఇబ్బందిగా మారుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి:

ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆ ఛార్జీలపై జీఎస్‌టీ ఉండదు.. తీర్పు ఇచ్చిన అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. లక్ష పెట్టుబడికి రూ.40 వేల వడ్డీ.. పూర్తి వివరాలు..!

Gold Loan: గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు: తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు.. ఏయే బ్యాంకుల్లో ఎంత శాతం అంటే..!