ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆ ఛార్జీలపై జీఎస్‌టీ ఉండదు.. తీర్పు ఇచ్చిన అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్

ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు నామ మాత్రమే మొత్తాన్ని వసూలు చేసి క్యాంటిన్‌ సౌకర్యాలను కల్పిస్తుంటాయి. సంస్థలు అందించే క్యాంటీన్ సదుపాయాలు ఉపయోగించే..

ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆ ఛార్జీలపై జీఎస్‌టీ ఉండదు.. తీర్పు ఇచ్చిన అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్
Follow us
Subhash Goud

|

Updated on: Aug 22, 2021 | 4:26 PM

ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు నామ మాత్రమే మొత్తాన్ని వసూలు చేసి క్యాంటిన్‌ సౌకర్యాలను కల్పిస్తుంటాయి. సంస్థలు అందించే క్యాంటీన్ సదుపాయాలు ఉపయోగించే ఉద్యోగులు.. వారు చెల్లించే మొత్తంపై జీఎస్‌టీ వసూలు చేయవద్దని అని ఏఏఆర్ తీర్పు వెలువరించింది. క్యాంటీన్ సదుపాయం వాడుకున్నందుకు ఉద్యోగుల నుంచి యాజమాన్యం వసూలు చేసే నామమాత్రపు మొత్తంపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్‌టీ) వర్తిస్తుందా అనే దానిపై తీర్పు కోరుతూ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) గుజరాత్ బెంచ్‌ను టాటా మోటార్స్ ఆశ్రయించింది. దీంతో ఈ తీర్పును వెల్లడించింది. ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు అందించే క్యాంటీన్ సదుపాయంపై సర్వీస్ ప్రొవైడర్ వసూలు చేసిన జీఎస్‌టీపై ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) కోర్ అవకాశం ఉందా అనే విషయాన్ని కంపెనీ కోర్టును కోరింది.

టాటా మోటార్స్ తన ఉద్యోగుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేసిందని, దీనిని తృతీయపక్ష క్యాంటీన్ సర్వీస్ ప్రొవైడర్ నడుపుతున్నట్లు కోర్టుకు వెల్లడించింది. క్యాంటీన్ ఛార్జీలలో ఎక్కువ మొత్తాన్ని టాటా మోటార్స్ భరిస్తుందని, మిగిలిన భాగాన్ని ఉద్యోగులు భరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. క్యాంటీన్ ఛార్జీల్లో ఉద్యోగుల చెల్లించే మొత్తాన్ని కంపెనీ సేకరించి క్యాంటీన్ సర్వీస్ ప్రొవైడర్ కు చెల్లిస్తుంది. అలాగే.. క్యాంటీన్ ఛార్జీల్లో ఉద్యోగుల భాగాన్ని సేకరించే ఈ కార్యకలాపాల్లో టాటా మోటార్స్ ఎలాంటి లాభం మార్జిన్‌ను కలిగి లేదని తెలిపింది.

జీఎస్‌టీ వర్తించదు

కాగా, ఈ క్యాంటీన్ సదుపాయం కింద చెల్లించిన జీఎస్‌టీపై ఐటీసీ జీఎస్‌టీ చట్టం కింద క్రెడిట్ బ్లాక్ చేస్తున్నట్లు ఏఏఆర్ తన తీర్పులో వెల్లడించింది. క్యాంటీన్ ఛార్జీల విషయంలో ఉద్యోగుల నుంచి సంస్థలు వసూలు చేస్తున్న మొత్తాన్ని సేకరించి క్యాంటీన్ సర్వీస్ ప్రొవైడర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఉద్యోగులు చెల్లించే మొత్తంపై కాకుండా యాజమాన్యాలు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది అని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) తెలిపింది. ప్రస్తుతం సబ్సిడీ కింద ఆహార సదుపాయాలను కల్పిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఉద్యోగుల నుంచి వసూలు చేసిన క్యాంటీన్ ఛార్జీలపై 5 శాతం పన్ను వసూలు చేస్తున్నట్లు ఏఎంఆర్ జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ పేర్కొన్నారు. క్యాంటీన్ ఛార్జీల ఉద్యోగుల నుంచి వసూలు చేసే నామమాత్రపు మొత్తంపై ఎటువంటి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదని అథారిటీ తీర్పు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Gold Loan: గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు: తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు.. ఏయే బ్యాంకుల్లో ఎంత శాతం అంటే..!

Post Office: సీనియర్‌ సిటిజన్స్‌ కోసం పోస్టల్‌ శాఖ గుడ్‌న్యూస్‌.. నిబంధనలు మార్పుల చేస్తూ కీలక నిర్ణయం..!

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. లక్ష పెట్టుబడికి రూ.40 వేల వడ్డీ.. పూర్తి వివరాలు..!