Powerful Women: పద్మజ.! బ్యాంకింగ్‌నేకాదు, ప్రభుత్వ శాఖలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బిజినెస్‌ స్కూల్స్‌ అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన దీశాలి

బ్యాంకింగ్ రంగంలో ప్రొబిషనరీ ఎంప్లాయ్‌గా మొదలైన ఆమె ప్రస్థానం.. సీఈవో స్థాయికి చేరింది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో

Powerful Women: పద్మజ.! బ్యాంకింగ్‌నేకాదు, ప్రభుత్వ శాఖలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బిజినెస్‌ స్కూల్స్‌ అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన దీశాలి
Padmaja
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 22, 2021 | 5:05 PM

Padmaja Chunduru: బ్యాంకింగ్ రంగంలో ప్రొబిషనరీ ఎంప్లాయ్‌గా మొదలైన ఆమె ప్రస్థానం.. సీఈవో స్థాయికి చేరింది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుండే పద్మజ చుండూరు.. బ్యాంకింగ్‌ రంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. అనేక ప్రభుత్వ శాఖలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బిజినెస్‌ స్కూల్స్‌ అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. పద్మజ విజయ ప్రస్థానాన్ని పరికిస్తే.. మిగతా ఉద్యోగాలు వేరు. బ్యాంకింగ్ రంగం వేరు. ఆ లెక్కలు.. చిక్కులు.. ఓ పట్టాన అర్థం కావు. చిన్న తేడా వచ్చిన అసలుకే మోసం వస్తుంది. అలాంటి ఫీల్డ్‌లోకి మహిళలు ఎంట్రీ కావడం.. రాణించడమే గొప్ప విషయం. అలాంటిది ఏకంగా దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఓ ప్రభుత్వరంగ బ్యాంకుకు సీఈఓగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ బ్యాంక్‌కు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తనదైన ముద్ర వేస్తున్నారు పద్మజ చుండూరు. ఈ స్థాయికి చేరిన మొదటి తెలుగు మహిళ పద్మజే కావడం విశేషం. ఇండియన్ బ్యాంక్‌ను డిజిటలైజేషన్ చేయడం, ఆధునిక సాంకేతికను అందించడంలో ఆమె కృషి మరువలేనిది. సీఈవోగా ఎంపికైన తర్వాత పరుగులు పెట్టించారు.

1984లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబిషనరీ ఎంప్లాయ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టారు పద్మజ చుండూరు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగారు..SBI డిజిటల్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో SBI US ఆపరేషన్స్ హెడ్‌గా 3 ఏళ్లు పనిచేశారు. 2019-20కి బ్యాంకర్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డు కూడా గెల్చుకున్నారు. అలాగే వెల్త్‌ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇండియా పురస్కారం కూడా ఆమె సొంతమైంది. కేవలం 10 నెలల్లోనే అలహాబాద్‌ బ్యాంక్‌ను .. ఇండియన్‌బ్యాంక్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విలీనం చేయడంలో సక్సెస్‌ అయ్యారు. 6 వేల బ్రాంచ్‌లు.. 40 వేల మంది ఉద్యోగులతో కొనసాగుతున్న ఇండియన్ బ్యాంక్‌ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.

అనేక ప్రభుత్వ శాఖలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బిజినెస్‌ స్కూల్స్‌కి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు పద్మజ చుండూరు. హైదరాబాద్ నిజాం కాలేజ్‌లో బీకాం చేసిన పద్మజ…ఆంధ్రాయూనివర్సిటీ నుంచి M.COM పట్టా పొందారు. మహిళలు బ్యాంకింగ్ రంగంలోకి ఎక్కువగా వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంతోపాటు.. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌నూ కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బిజినెస్‌ స్కూల్స్‌కి డైరెక్టర్‌గానూ కొనసాగుతున్నారు. దేశంలో అత్యుత్తమ బ్యాంకర్‌గా అందరి మన్ననలు పొందుతున్నారు పద్మజ చుండూరు.

Read also: Agri Gold: అగ్రిగోల్డ్ బాధిత డిపాజిట్‌దారులకు 24న ప్రభుత్వం సొమ్ములు చెల్లిస్తుంది: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి