Income Tax Refund: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. రూ.50వేల కోట్ల రీఫండ్‌.. డబ్బులు వచ్చాయా.? లేదా తెలుసుకోండిలా!

Income Tax Refund: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 16 వరకు పన్ను చెల్లింపుదారులకు రూ.49వేల 696 కోట్లను రీఫండ్‌ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది..

Income Tax Refund: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. రూ.50వేల కోట్ల రీఫండ్‌.. డబ్బులు వచ్చాయా.? లేదా తెలుసుకోండిలా!
Income Tax Refund
Follow us
Subhash Goud

|

Updated on: Aug 22, 2021 | 5:35 PM

Income Tax Refund: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 16 వరకు పన్ను చెల్లింపుదారులకు రూ.49వేల 696 కోట్లను రీఫండ్‌ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ట్వీట్‌ చేసింది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (CBDT).. ఏప్రిల్‌ 1, 2021, ఆగస్టు 16, 2021 మధ్య కాలంలో 22.75 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు 49,696 కోట్ల రూపాయలను రీఫండ్‌ చేస్తున్నట్లు జారీ చేసింది. 21 లక్షల 50 వేల 668 వ్యక్తిగత కేసుల్లో ఆదాయపు పన్ను శాఖ 14వేల 608 కోట్ల రూపాయలను రీఫండ్‌ చేసింది. అదే సమయంలో 1 లక్షా 24 వేల 732 కార్పొరేట్‌ కేసుల్లో 35 వేల 88 కోట్ల రూపాయల రీఫండ్‌ను జారీ చేసింది. ఈ మొత్తాన్ని చెల్లింపుదారుల ఖాతాకు బదిలీ చేసినట్లు వెల్లడించింది.

ఖాతాలో రీఫండ్‌ డబ్బులు వచ్చాయా..? లేదా తెలుసుకోవడం ఎలా..?

ఆదాయపు పన్ను శాఖ పంపిన రీఫండ్‌ మొత్తం మీ ఖాతాలో వచ్చాయా..? లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ఖాతాదారులు ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. తర్వాత ఇక్కడ ఆదాయపు పన్ను రీఫండ్‌ స్థితిని చెక్‌ చేయాలి.

ఐటీఆర్‌ ధృవీకరణ..

ఒక వేళ మీరు ఐటీఆర్‌ ప్రొఫైల్‌లో ధృవీకరించకపోతే మీ ఆధార్‌ సహాయంతో రీ-వెరిఫికేషన్‌ కోసం అభ్యర్థనను పంపాలి. లేదా సంతకం చేసిన ఐటీఆర్‌-వీ (ITR-V) ఫారమ్‌ను స్పీడ్‌ పోస్టు ద్వారా ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి పంపాలి. ఈ ప్రక్రియ పూర్తి కానంత వరకు మీకు రీఫండ్‌ జమ చేయబడదు. సీపీఆర్‌ లేదా అసెస్సింగ్‌ అధికారికి ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా ఐటీఆర్‌ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయాలని పన్ను చెల్లింపుదారులు డిపార్ట్‌మెంట్‌ను అభ్యర్థించవచ్చు.

ఈ పన్ను రీఫండ్‌ చేయడంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. అయితే పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తుంది. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలుపై పన్ను చెల్లింపుదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆలస్య రుసుమును వసూలు చేసింది. అయితే కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో జరిగిన చిన్న తప్పిదం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్కార్‌ ఈ తప్పును సరిచేసింది. ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారులకు వారి నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీని, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తామని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇది వరకే ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

అలాగే పన్ను చెల్లింపుదారులు లేటెస్ట్ వెర్షన్ ఐటీఆర్ ప్రిపరేషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించాలని కోరింది. ఇకపోతే సెప్టెంబర్ 30 వరకు ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆదాయపు శాఖ పొడిగించిన విషయం తెలిసిందే. ఇది వరకు గడువు జూలై 31 వరకే ఉండగా, గడువు పొడిగించినా కూడా అంటే జూలై 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినా కూడా కొంత మంది పన్ను చెల్లింపుదారుల నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆలస్య రుసుము లేదా వడ్డీని వసూలు చేసింది. చిన్న పొరపాటు వల్ల తలెత్తిన ఈ సమస్య కారణంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కలిగించినట్లయింది.

ఇవీ కూడా చదవండి:

RBI New Guidelines: ఆర్బీఐ కొత్త నిబంధనలు రానున్నాయ్‌.. ఇకపై కార్డు వివరాలు గుర్తుపెట్టుకోవాల్సిందే..!

ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆ ఛార్జీలపై జీఎస్‌టీ ఉండదు.. తీర్పు ఇచ్చిన అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. లక్ష పెట్టుబడికి రూ.40 వేల వడ్డీ.. పూర్తి వివరాలు..!

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ