Coconut Benefits: కొబ్బరి మ్యాజిక్ ఫ్రూట్.. దేవుడికి నైవేధ్యంగానే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు
Coconut Benefits: ప్రపంచములో మూడవ వంతు జనాభా వాళ్ల ఆహారములోను, ఆర్థిక సంపత్తులోను, ప్రతి పూజా-పవిత్ర కార్యక్రమములోను చాలా భాగం కొబ్బరితోనే ముడిపడి ఉంది. భారతీయ హిందూ సంప్రదాయంలో..
Coconut Benefits: ప్రపంచములో మూడవ వంతు జనాభా ఆహారములోను, ఆర్థిక సంపత్తులోను, ప్రతి పూజా-పవిత్ర కార్యక్రమములోను చాలా భాగం కొబ్బరితోనే ముడిపడి ఉంది. భారతీయ హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు విశిష్టస్థానం ఉంది. కొబ్బరికాయను భారతీయులు శుభప్రధంగా భావిస్తారు. పూజాదికార్యక్రమాలకు, శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. అంతేకాదు కొబ్బరికాయ లేని పండగ లేదంటే అతిశయోక్తికాదు.. ప్రాచీన కాలం నుంచి విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలం కొబ్బరి. అయితే పూజలకే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదని.. అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పోషకాహారం:
పచ్చికొబ్బరిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ, బి, సి, రైబోఫ్లెవిన్, ఐరన్, కాలసియం, ఫాస్పరస్, పిండిపదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొబ్బరి నీరు శక్తినివ్వటానికి మంత్రం జలంలా పనిచేస్తుంది. కొబ్బరి శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.
జుట్టుకు సంరక్షణ:
హెయిర్ కేర్ కు కొబ్బరి మంచి ఔషధం. జుట్టుకు కొబ్బరి నూనె మాత్రమే కాదు కొబ్బరి పాలు కూడా మంచి సంరక్షణకారి. జుట్టుని తేమను అలాగే ఉంచడానికి తరచుగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు.
సహజ శక్తి:
ఉదయం బద్దకంగా , శక్తి హీనంగా ఉన్నప్పుడు కొబ్బరి మంచి సహాయకారిగా పనిచేస్తుంది. కొబ్బరిలోని ఎలక్ట్రోలైట్స్ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మనస్సు , శరీరాన్ని పునరుజ్జీవనం చేయడంలో సహాయపడతాయి.
మెరిసే చర్మం:
కొబ్బరి నీరు అత్యంత సహజమైన టోనర్‌గా పరిగణించబడుతుంది. కొబ్బరిని అందం కోసం బాహ్యంగా వినియోగించడమే కాదు.. తగిన మోతాదులో ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది. కొబ్బరిలో ఉన్న సైటోకినిన్స్ చర్మంలోని వృధ్యాప్యపు ఛాయలను నెమ్మదిస్తాయి.
అజీర్తి సమస్యను నయం చేస్తుంది:
కొబ్బరి రుచికరమైంది, ఆరోగ్యకరమైనది. అందుకే దీనిని మేజిక్ ఫ్రూట్‌గా పరిగణిస్తారు. ఇందులో చాలా తక్కువ చక్కెర ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరి నీరు ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. కొబ్బరిలోని ఎంజైమ్‌లు యాసిడ్ రిఫ్లక్స్‌ను అరికట్టడంలో కూడా సహాయపడతాయి.
హిందూ సంప్రదాయంలో కొబ్బరి ప్రముఖ స్థానము ఉంది. మహారాష్ట్ర నరళి పూర్ణిమను జరుపుకుంటారు. ఈ రోజున, రాష్ట్రంలోని తీరప్రాంతంలోని హిందూ మత్స్యకార సంఘాలు సముద్రాన్ని పూజిస్తారు. తమ జీవనోపాధికి సముద్రం సహకరించమని కోరుకున్నారు. శ్రావణ మాసంలోని పౌర్ణమి రాత్రి సముద్రంలో కొబ్బరి అన్నం, పువ్వులను సమర్పించడం ఈ ఆచారంగా వస్తుంది.
Also Read: మెగాస్టార్ చిరు బర్త్ వేడుకల్లో మెగా బ్రదర్స్, అల్లు అరవింద్ ఫ్యామిలీ సందడి.. వీడియో వైరల్