Heart Health: గుండె ఆరోగ్యం కోసం ఈ 5 శాఖాహారాలు తప్పనిసరి..! వెంటనే డైట్‌లో చేర్చండి..
Heart Health: ఆధునిక జీవితంలో మనుషులను ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ
Heart Health: ఆధునిక జీవితంలో మనుషులను ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులు. ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనా. గుండె జబ్బులకు ప్రధాన కారణం.. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు. గుండె జబ్బులు కేవలం వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా అధికమయ్యాయని పేర్కొంటున్నారు. అయితే గుండె ఆరోగ్యం కోసం ఈ 5 శాఖాహారాలు తప్పనిసరిగా మీ డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. టమోటా టమోటాలు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇది లేకుండా చాలా వంటకాలు అసంపూర్ణంగానే ఉంటాయి. పరిశోధన ప్రకారం టమోటాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోధించగలవు. టమోటాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
2. కారెట్ క్యారెట్‌లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 1, బి 2, బి 6 అలాగే కాల్షియం, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. వీటితో పాటు ఆల్ఫా, బీటా కెరోటిన్ కూడా గుండెకు చాలా మంచిది. మీరు క్యారెట్లను తీసుకుంటే మీ హృదయం సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది.
3. తృణధాన్యాలు వోట్స్, బార్లీ, రై, బుక్వీట్, క్వినోవాలు గుండె ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తాయి. ఇందులో ఫైబర్‌తో ఎక్కువగా ఉంటుంది. చెడు ‘LDL’ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం ద్వారా మీరు గుండె జబ్బులను దూరం పెట్టవచ్చు.
4. స్ట్రాబెర్రీలు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్‌బెర్రీస్‌లో ఆంథోసైనిన్‌ల వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ, ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులను దూరంగా ఉంచుతాయి.
5. డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. కర్జూర, వాల్‌నట్స్, బాదంలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి. ఇందులో మెగ్నీషియం, రాగి, మాంగనీస్, గుండెకు ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి.