Ayurvedic-Home Tips: వంటిల్లే ఔషధాల గని.. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి వాటినుంచి ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందండి

Ayurvedic-Home Tips: వంటిల్లే ఔషదాల గని. మనం రోజూ ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగించే మసాలా దినుసులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల బారినుంచి..

Ayurvedic-Home Tips: వంటిల్లే ఔషధాల గని.. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి వాటినుంచి ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందండి
Ayurvedic Remedies
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2021 | 6:23 AM

Ayurvedic-Home Tips: వంటిల్లే ఔషదాల గని. మనం రోజూ ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగించే మసాలా దినుసులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల బారినుంచి రక్షణ కల్పిస్తాయి. తలనొప్పి, షుగర్ వ్యాధి వంటి వాటికి వంటింటిలో ఉండే దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులే కాదు…సీజనల్ గా దొరికే నేరేడు పండు వంటితో కూడా దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. ఈరోజు ఆయుర్వేదంలో ఉపయోగించే వంటింటి దినుసులతో సింపుల్ చిట్కలాను పాటించండి..

తలనొప్పితో బాధపడుతుంటే: 

ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఉసిరిక పొడి, శొంఠి, పిప్పిలి, మిరియాల చూర్ణం నెయ్యి బెల్లంలో కలిపి రోజు తీసుకున్నా కూడా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉసిరి రసం, నిమ్మరసం, చక్కెర కలిపి రోజుకు రెండు మూడు సార్లు తాగినా తలనొప్పి తగ్గుతుంది.

షుగర్ నివారణకోసం: 

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ పని తీరును మెరుగుపరచటంలో వేప, నేరేడు, మెంతులు, కాకర, దొండకాయ బాగా పని చేస్తాయి. వీటిల్లో ఉండే  యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను అదుపు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కనుక సీజనల్ గా దొరికే వీటిని ఏవి అందుబాటులో ఉంటే వాటిని తరచుగా తింటూ ఉండాలి. ఇవి అందుబాటులో లేకపోతె.. వేప, నేరేడు, మెంతులు వంటివి పౌడర్ల రూపంలో కూడా లభిస్తాయి. ఎంచుకున్న పొడులను ఉదయం ఒక టీ స్పూను, రాత్రి ఒక టీ స్పూను చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి.

 చర్మ వ్యాధుల నివారణ కోసం: 

ఎగ్జిమా వంటి చర్మవ్యాధులుంటే తేనె, దాల్చిన చెక్కపొడి సమపాళ్లలో తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే తగ్గుతుంది.

జలుబు, దగ్గు: 

కొన్ని మిరియాలను తీసుకుని మెత్తగా పొడి చేసి చక్కెర లేదా నేతితో కలిపి తీసుకుంటే మామూలు జలుబు, ముక్కు కారడం, గొంతులో దురద,  గొంతునొప్పి, దగ్గు, జ్వరంల నుండి ఉపశమనం లభిస్తుంది. ఒక టేబుల్‌ స్పూను తేనెలో అర టేబుల్‌ స్పూను అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: Weight Lose Tips: జీవన శైలిలో ఈ 5 మార్పులు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు..! ఏంటో తెలుసుకోండి..