AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Lose Tips: జీవన శైలిలో ఈ 5 మార్పులు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు..! ఏంటో తెలుసుకోండి..

Weight Lose Tips: ఆధునిక జీవన శైలి, సమయపాలన లేని ఆహార పద్దతుల వల్ల చాలామంది విపరీతంగా బరువు

Weight Lose Tips: జీవన శైలిలో ఈ 5 మార్పులు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు..! ఏంటో తెలుసుకోండి..
Weight Loss
Follow us
uppula Raju

|

Updated on: Aug 23, 2021 | 7:48 PM

Weight Lose Tips: ఆధునిక జీవన శైలి, సమయపాలన లేని ఆహార పద్దతుల వల్ల చాలామంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకొని బాధపడుతున్నారు. తర్వాత బరువు తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎక్సర్‌ సైజ్‌లు, గంటల తరబడి జిమ్‌లో గడపడం వంటివి చేస్తున్నారు. కానీ జీవన శైలిలో మార్పులు చేయడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. వేడి నీరు త్రాగండి రాత్రి సమయంలో మీ మెటబాలిజం మందగించినట్లయితే ఉదయాన్నే ఒకటి నుంచి రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి. మీ జీర్ణక్రియతో పాటు విషాన్ని బయటకు పంపడంలో వేడి నీరు సహాయపడుతుంది. నిజానికి వేడి నీరు శరీరంలోని కొవ్వు కణాలను బర్న చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఇది కాకుండా ఆకలిని దూరం చేస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు వేడి నీరు తాగితే తక్కువగా తింటారు.

2. సూర్యకాంతి శరీరంపై పడేలా చూడాలి ఒక అధ్యయనం ప్రకారం సూర్య కిరణాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. సూర్యకాంతి తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ డి పెరుగుతుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

3. ప్రతిరోజు వర్కవుట్స్ తప్పనిసరి ప్రతిరోజూ ఉదయం లేచి 20 నుంచి 25 నిమిషాల పాటు వర్కవుట్‌లు చేయాలి. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. మీ రోజు కూడా చాలాబాగా ప్రారంభమవుతుంది. మెరుగైన జీవక్రియ వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4. పోషకాహారం తినండి.. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు బరువు తగ్గడానికి పోషకాహారం తినాలి. CDC (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ప్రకారం.. క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు తగ్గుతారని తేలింది. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను చేర్చండి. పీచు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

5. చన్నీటి స్నానం చేయండి చల్లటి నీటితో స్నానం చేయడం అన్ని సమయాలలో మంచిది కాదు. కానీ కొన్ని అధ్యయనాలు శరీరంలో స్తంభింపచేసిన కొవ్వు కణజాలాన్ని సక్రియం చేస్తాయని తేలింది. ఉదయాన్నే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుందని జీవక్రియ రేటు పెరుగుతుందని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి.

Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపు రూ. 300 టికెట్ కోటాను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఏ సమయంలోనంటే

డబ్బు కోసం కన్న కొడుకు వేధిస్తున్నాడని.. కిరాయి హంతకులకు రూ.9 లక్షలు సుపారీ ఇచ్చిన చంపించిన తండ్రి

Allu Arjun Pooja Hegde: అల్లు అర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్ మళ్లీ రిపీట్‌కానుందా..!