”అఫ్గాన్‌ క్రికెటర్‌తో నిశ్చితార్ధం రద్దు చేసుకున్నా”.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ప్రకటన..

ఎప్పుడూ ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ అర్షి ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది...

''అఫ్గాన్‌ క్రికెటర్‌తో నిశ్చితార్ధం రద్దు చేసుకున్నా''.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ప్రకటన..
Arshi Khan
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 23, 2021 | 6:27 PM

ఎప్పుడూ ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ అర్షి ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడం వల్ల తన నిశ్చితార్ధం రద్దు చేసుకున్నానని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆఫ్గనిస్తాన్ క్రికెటర్‌తో నిశ్చితార్ధం జరగాల్సి ఉందని.. కానీ ఆఫ్గాన్ దేశం తాలిబన్ల నియంత్రణలోకి రావడంతో అది కాస్తా రద్దయ్యిందని తెలిపింది. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్షి ఖాన్ తన పెళ్లికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది.

”ఈ ఏడాది అక్టోబర్‌లో ఆఫ్గాన్ క్రికెటర్‌తో నాకు నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. అతన్ని మా నాన్నగారు ఎంపిక చేశారు. సదరు క్రికెటర్ మా నాన్నగారి స్నేహితుడు కుమారుడు. అయితే తాలిబన్లు ఆఫ్గాన్‌ను వశం చేసుకున్న తర్వాత నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నాం. మేమిద్దరం ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మేము మంచి స్నేహితులుగా ఉన్నాం” అని స్పష్టం చేసింది.

”నా మూలాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాయి. నేను అఫ్గనిస్తాన్‌ పఠాన్‌ను. నా కుటుంబం యూసుఫ్ జహీర్ పఠాన్ జాతికి చెందినది. నా తాత అఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చి భోపాల్‌లో జైలర్‌గా పని చేస్తున్నారు. నేను భారతీయ పౌరురాలినే” అని అర్షి ఖాన్ అన్నారు. కాగా, ఆఫ్గనిస్తాన్ దేశం తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ పరిస్థితులు మరింతగా క్షీణించాయి. అంతర్జాతీయంగా వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.

33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!