AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Kesari: లాయర్‌గా లక్షలు ఆర్జించి.. ఆంధ్రరాష్ట్రానికి సీఎంగా చేసినా.. చివరకు తనకంటూ ఏమీ మిగుల్చుకోని ‘ఆంధ్రకేసరి’

Tanguturi Prakasam Pantulu: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనమన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సోమవారం ఆగస్టు 23వ తేదీన టంగుటూరి ప్రకాశం

Andhra Kesari: లాయర్‌గా లక్షలు ఆర్జించి.. ఆంధ్రరాష్ట్రానికి సీఎంగా చేసినా.. చివరకు తనకంటూ ఏమీ మిగుల్చుకోని 'ఆంధ్రకేసరి'
Tanguri Prakasham Patulu
Surya Kala
|

Updated on: Aug 23, 2021 | 4:29 PM

Share

Tanguturi Prakasam Pantulu: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనమన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సోమవారం ఆగస్టు 23వ తేదీన టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ప్రకాశం పంతులు త్యాగనిరతిని గుర్తు చేసుకున్నారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో పూలుజల్లి నివాళులర్పించారు.

నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక ,వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు.తీరాచేసి బావగారింటికి వెడితే ‘నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా’అన్నాడా బావ గారు.చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుఱ్ఱాడు. ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయినప్పటికీ తన లక్ష్యం అదికాదని.. ఇంగ్లండ్ వెళ్లి..  బారిస్టర్ చదువుని అభ్యసించాడు. అనంతరం మద్రాస్ మైలాపూర్ ఎంతో మంది సీనియర్స్ తో పోటీపడి ఆ రోజులలోనే(1917-18 నాటికే)రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయికి చేరుకున్నాడు.. ఒక్క రూపాయి కోసం కష్టపడిన ఆయన , కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసి ఆర్ధికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు.. అనంతరం స్వాతంత్య్ర కోసం పోరాడుతూ.. ఉన్న ఆస్తులు సంపాదన పోగొట్టుకుని ఆకలి తీర్చుకోవడానికి పుట్టిన రోజు శాలువా కప్పితే.. అది నాకేందుకు అరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న వ్యక్తి.. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం. ఇలాంటి మహనీయుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈతరం.

టంగుటూరి ప్రకాశం’ పంతులు సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధుడు. మనిషి కృషి పట్టుదల ఉంటె ఎన్నికష్టనష్టాలు వచ్చినా జీవితంలో పైకి ఎదగవచ్చనునని నేటి తరానికి తెలిపిన స్ఫూర్తి ప్రధాత. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని.. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు.. టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు. ఆయన జీవితం పూలపాన్పు కాదు.. బాల్యంలోనే ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రకాశం పంతులు జీవితంలోని ఎన్నో స్ఫూర్తినిచ్చే సంఘటనలున్నాయి.

గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికారు. తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. లాయర్ గా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజలకోసం తాను స్వచ్చందంగా జైలుశిక్షను అనుభవించారు. గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం ‘స్వరాజ్య’ పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందారు. అదే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశారు.సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టారు.. ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా,ముఖ్యమంత్రి గా పనిచేశారు.

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953 తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాఋ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు వారి కోసం హైకోర్టు స్థాపించారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించారు. సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపారు. బెజవాడలో కాటన్ దొర కట్టిన బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడితే.. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బ్యారేజ్ రిపేర్ చేయడానికి ఇవ్వమని స్పష్టం చేస్తే.. రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ ను బాగుచేయించి నిలబెట్టారు. ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దారు. అందుకే ప్రజలందరూ ఆ బ్యారేజ్ ను ఆయన పేరుతోనే ప్రకాశం బ్యారేజ్ గా పిలుచుకుంటున్నారు.

రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశారు. అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్యాన్ని అనుభవించారు. ప్రకాశం పంతులు తన పుట్టిన రోజున తనను శాలువతో సత్కరిస్తే ‘ఈ శాలువ నాకెందుకురా!ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!!’ అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని అనారోగ్యంతో మే 20, 1957న దివి నుంచి భువికేగారు

Also Read: టీడీపీ నేత నారా లోకేష్‌కు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నాస్త్రాలు