Mekathoti Sucharitha: టీడీపీ నేత నారా లోకేష్‌కు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నాస్త్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత టీడీపీపై ఘాటైన విమర్శలకు దిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మహిళలపై దాడులు
AP Home Minister: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత టీడీపీపై ఘాటైన విమర్శలకు దిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మహిళలపై దాడులు జరిగితే మంత్రి హోదాలో ఉన్న లోకేష్ అప్పుడెందుకు బాధితుల్ని పరామర్శించలేదని సుచరిత నిలదీశారు. టీడీపీ పాలనలో దాడికి గురైన తహశీల్దార్ వనజాక్షి, విద్యార్థినులు రిషితేశ్వరి, సుగాలి ప్రీతి కుటుంబాల ఇళ్లుకు ఎందుకు వెళ్లలేదని ఆమె ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత విషయంలో చూపిస్తోన్న చొరవను హోం మంత్రి వివరించే ప్రయత్నం చేశారు. పక్క రాష్ట్రం(తెలంగాణ)లో దిశ ఘటన జరిగితే మన రాష్ట్రంలో దిశ చట్టం తెచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిదని సుచరిత గుర్తు చేశారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సీఎం వైయస్ జగన్ పైకి తీసుకువస్తున్నారని ఆమె తెలిపారు.
దిశ యాప్ మహిళలు, యువతులకు కష్టకాలంలో ఎంతో సహాయపడుతుందని చెప్పిన హోం మంత్రి.. ఇప్పటి వరకు 40 లక్షల మంది యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. రమ్య ఘటనపై సీఎం వైయస్ జగన్ వెంటనే స్పందించారని, బాధిత కుటుంబానికి రూ.14.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇంటి పట్టా కూడా అందించారని మంత్రి సుచరిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read also: Lockers: బ్యాంక్ లాకర్ల విషయంలో రూల్స్‌ను పూర్తిగా మార్చేసిన ఆర్‌బీఐ.. ఇప్పడు మరింత ఈజీ