Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lockers: బ్యాంక్‌ లాకర్ల విషయంలో రూల్స్‌ను పూర్తిగా మార్చేసిన ఆర్‌బీఐ.. ఇప్పడు మరింత ఈజీ

బ్యాంక్‌లో లాకర్లకు సంబంధించి ఆర్‌బీఐ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. బ్యాంక్‌లో లాకర్‌ కావాలంటే ఇకపై ఆదే బ్యాంక్‌లో ఖాతా ఉండాల్సిన అవసరమే

Lockers: బ్యాంక్‌ లాకర్ల విషయంలో రూల్స్‌ను పూర్తిగా మార్చేసిన ఆర్‌బీఐ.. ఇప్పడు మరింత ఈజీ
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 23, 2021 | 1:07 PM

Bank Lockers: బ్యాంక్‌లో లాకర్లకు సంబంధించి ఆర్‌బీఐ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. బ్యాంక్‌లో లాకర్‌ కావాలంటే ఇకపై ఆదే బ్యాంక్‌లో ఖాతా ఉండాల్సిన అవసరమే లేదు. బ్యాంకు కోరిన వివరాలు ఇచ్చి, నిబంధనలు పాటించిన వారికి సేఫ్‌ డిపాజిట్‌ లాకర్‌.. సేఫ్‌ కస్టడీని అందించాలని ఆదేశిస్తూ ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు 2022 జనవరి1, నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు తమ శాఖల్లో ఖాళీగా ఉన్న లాకర్‌ల సంఖ్య, వెయిటింగ్‌ లిస్ట్‌ను కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌లో నమోదు చేస్తారు. లాకర్ల కేటాయింపులో పారదర్శకత కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు.

లాకర్లకు సంబంధించి ఆరు నెలల్లో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాల్సిందిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆర్‌బీఐకి సూచించింది. కోల్‌కతాకు చెందిన ఒక ఖాతాదారుడు లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వడం లేదా పరిహారంగా రూ.3లక్షలు ఇవ్వాలని జాతీయ వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశారు. అక్కడి నుంచి ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆర్‌బీఐ ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాంకులు తమ దగ్గరున్న లాకర్లను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాయి.

ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, పిడుగులు పడటం, భూకంపాలు తదితరాలు వచ్చినప్పుడు, లాకర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తి నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టానికి బ్యాంకు బాధ్యత వహించదు. అయితే అగ్ని ప్రమాదాలు, దొంగతనం, బ్యాంకు ఉద్యోగుల మోసం వల్ల లాకర్‌లోని వస్తువులకు ఏదైనా నష్టం వాటిల్లితే.. దానికి బ్యాంకు కచ్చితంగా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో లాకర్‌ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారంగా ఇవాలని ఆర్‌బీఐ పేర్కొంది.

లాకర్‌ అద్దెను సకాలంలో రాబట్టుకునేందుకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి టర్మ్‌ డిపాజిట్‌ కోరవచ్చు. ఇది మూడేళ్ల అద్దెకు సమానంగా ఉండటంతో పాటు, లాకర్‌ తాళంచెవి పోతే కొత్తది ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చు కూడా కలిసి ఉండొచ్చు. అయితే, ఇప్పటికే లాకర్‌ నిర్వహిస్తున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. మూడేళ్లపాటు అద్దె చెల్లించని లాకర్‌ను నిబంధనలు, బ్యాంకు విచక్షణ మేరకు స్వాధీనం చేసుకోవచ్చు.

Read also: ‘వారికో లెక్క. మాకో లెక్కా..!’ అంటూ అధికారులపై మండిపడుతున్న మండలి మాజీ పెద్దలు, పీక్స్‌కు చేరిన ప్రోటోకాల్ రగడ