యూపీ బీజేపీ శ్రేణుల అత్యుత్సాహం.. జాతీయ జెండాను అవమానించారంటూ విపక్షాలు ఫైర్
యూపీలో బీజేపీ శ్రేణుల అత్యుత్సాహం వివాదాస్పదమవుతోంది. మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ పార్థీవదేహంపై జాతీయ జెండా కప్పి, దానిపైన బీజేపీ జెండాను ఆ పార్టీ శ్రేణులు కప్పారు.
యూపీలో బీజేపీ శ్రేణుల అత్యుత్సాహం వివాదాస్పదమవుతోంది. మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ పార్థీవదేహంపై జాతీయ జెండా కప్పి, దానిపైన బీజేపీ జెండాను ఆ పార్టీ శ్రేణులు కప్పారు. లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఫోటోను బీజేపీ ట్వీట్ చేయడం వివాదానికి మరింత ఆజ్యంపోసింది. బీజేపీ శ్రేణులు జాతీయ జెండాను అవమానించారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. జాతీయ జెండాపై బీజేపీ పతాకాన్ని కప్పడం నవభారతంలో సబబేనా అంటూ యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ ప్రశ్నించారు. జాతీయ పతాకం మీద బీజేపీ జెండాను కప్పడం ద్వారా జాతీయ పతాకాన్ని గౌరవించినట్లా? అవమానించినట్లో దేశ భక్తులమంటూ నిత్యం గొప్పల చెప్పుకునే బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
అటు సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి ఘన్‌శ్యామ్ తివారీ సైతం ఈ విషయంలో బీజేపీ తీరును విమర్శించారు. దేశం కంటే పార్టీ గొప్ప.. జాతీయ జెండా కంటే పార్టీ జెండా గొప్పదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ పశ్చాత్తామం వ్యక్తంచేయడం సరికాదని విమర్శించారు.
Is it ok to place party flag over Indian flag in New India? pic.twitter.com/UTkfsTwUzz
— Srinivas BV (@srinivasiyc) August 22, 2021
Party above the Nation. Flag above the Tricolor.#BJP as usual : no regret, no repentance, no sorrow, no grief.#NationalFlag https://t.co/3bUSiDPJXF
— Ghanshyam Tiwari (@ghanshyamtiwari) August 22, 2021
అనారోగ్యంతో బాధపడుతూ యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ శనివారంనాడు తుదిశ్వాస విడవటం తెలిసిందే. లక్నోలో ఆయన భౌతికకాయానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించారు.
Also Read..