AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olympics: ఒలింపిక్స్‌లో ఈశాన్యరాష్ట్రాల క్రీడాకారులు ఎక్కువ పతకాలు గెలుచుకున్నారు! దీని వెనుక ఉన్న కారణం తెలుసా?

ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం గతం కంటే ఎక్కువ పతకాలు సాధించింది. మొత్తం 127 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. అందులో 8 మంది ఈశాన్య ప్రాంతానికి చెందినవారునున్నారు.

Olympics: ఒలింపిక్స్‌లో ఈశాన్యరాష్ట్రాల క్రీడాకారులు ఎక్కువ పతకాలు గెలుచుకున్నారు! దీని వెనుక ఉన్న కారణం తెలుసా?
North Eastern Players
KVD Varma
|

Updated on: Aug 23, 2021 | 11:21 AM

Share

Olympics: ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం గతం కంటే ఎక్కువ పతకాలు సాధించింది. మొత్తం 127 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. అందులో 8 మంది ఈశాన్య ప్రాంతానికి చెందినవారునున్నారు. వారు మన దేశానికి 3  పతకాలు అందించారు. మన క్రీడాకారులు 18 క్రీడల్లో పాల్గొన్నారు. వీటిలో ఏడు పతకాలు సాధించారు. అందులో మూడు పతాకాలు ఈశాన్యరాష్ట్రాల ఆటగాళ్లు సాధించడం విశేషం. అయితే, మొత్తం క్రీడాకారుల్లో 8 మంది మాత్రమే ఈ రాష్ట్రాల ఆటగాళ్లు  అంటే వారు 38 శాతం పథకాలను సాధించినట్లు. మిగిలిన 119 మంది క్రీడాకారులు 4 పతకాలను మాత్రమే సాధించారు. ఈ లెక్క ఈశాన్యరాష్ట్రాల క్రీడాకారుల ప్రతిభను చెబుతోంది.

మన దేశం నుంచి పతకాలు సాధించింది వీరే..

నార్త్-ఈస్ట్ యొక్క సైఖోమ్ మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టర్), లోవ్లినా బోర్గోహైన్ (బాక్సర్) మరియు షంగలక్పామ్ నీలకంఠ్ శర్మ (పురుషులు, హాకీ ప్లేయర్) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఇవి కాకుండా, నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) స్వర్ణం, రవి కుమార్ దహియా (రెజ్లింగ్) రజతం, పివి సింధు (బ్యాడ్మింటన్) కాంస్యం, బజరంగ్ పునియా (రెజ్లింగ్) కాంస్యం మరియు భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలుచుకున్నారు.

అంటే, ఈశాన్యరాష్ట్రాల సక్సెస్ రేటు దాదాపు 38%. నార్త్-ఈస్ట్ రాష్ట్రాలు దేశానికి కీర్తి తీసుకురావడం ఇదే మొదటిసారి కాదు.  గతంలో మేరీ కోమ్.. బైచుంగ్ భూటియా వంటి ఈశాన్య దేశాల ఆటగాళ్లు దేశం.. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించారు.

ఈశాన్య భారతదేశాన్ని స్పోర్ట్స్ నర్సరీ అని ఎందుకు పిలుస్తారు? ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇక్కడి క్రీడాకారులు ముందుగా జాతీయ స్థాయిలో, ఆపై అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ఎలా చాటుతున్నారు?

దీనికి కొన్నికారణాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

వాతావరణం..

ఈశాన్యరాష్ట్రాల్లో చాలా ఎక్కువ వేడి లేదా చాలా ఎక్కువ చల్లదనం ఉండదు. ఇక్కడ ఇంచుమించుగా జపాన్..జకార్తా వంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఒలింపిక్ క్రీడల వద్ద ఉండే వాతావరణ పరిస్థితులకు సరిగ్గా సరిపోతాయి. టోక్యోలో వాతావరణం చాలావరకూ ఇక్కడి వాతావరణంలానే ఉంది.

ఇక ఇక్కడ ఉన్న కమ్యూనిటీ సర్వీస్ విధానం కూడా ఇక్కడి వారిలో పూర్తి ఫిట్ నెస్ ఇస్తుంది. కమ్యూనిటీ సర్వీస్ విధానం అంటే.. ఒకరి పొలంలో పని ఉంటే.. గ్రామంలో అందరూ అక్కడ పని చేస్తారు. అంటే.. ఎవరి పొలంలో పని అయినా అందరూ కలిసి చేసుకుంటారు. దీంతో ఇక్కడ అందరూ శారీరకంగా కష్టం చేస్తూనే ఉంటారు. అందువల్ల వారు ఎప్పుడు దృఢంగా ఉంటారు. ఇది కూడా ఒక కారణం.

ఆహరం..

ఈ ప్రాంతాల్లో నేచురల్ అలాగే పూర్తిగా ఎరువులు లేకుండా పండిన ఆర్గానిక్ పంటలను ఆహారంలో తీసుకోగలుగుతారు.  ఇక్కడ తులసి ఆకులతో కలిపి చికెన్ వండుతారు. ఇక వీరి ఆహారంలో వెన్న, నెయ్యి తప్పనిసరిగా ఉంటాయి. అలాగే చేపలు, సోయాబీన్స్, పుట్టగొడుగులు ఎక్కువగా తింటారు. చికెన్, పోర్క్, బీఫ్, మటన్ ఇక్కడ సాధారణ ఆహరం.

అన్నంలో కాయగూరలు కలిపి వండుతారు. ఎక్కువగా తాజా ఆకుకూరలు అన్నంలోకి కూరగా వండుకుంటారు. సాధారణంగా ఒక అథ్లెట్ రోజుకు 2500 నుంచి 300 కేలరీల ఆహరం తీసుకోవాల్సి ఉంటుంది. ఈశాన్యరాష్ట్రాల ప్రజలు సాధారణంగానే అన్ని కేలరీలు ఉన్న ఆహరం తీసుకుంటారు. అంతకు తగ్గ శారీరక కష్టం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ అడవుల్లోదొరికే ప్రాకృతిక వైద్య మొక్కలను కూడా వీరు నిత్యం ఆహారంలో తీసుకుంటారు.

పోటీతత్వం..

ఈశాన్యరాష్ట్రాల ప్రజల్లో పోటీతత్వం ఎక్కువ. వీరు ఓటమిని అంత త్వరగా ఒప్పుకోరు. గెలుపు కోసం నిత్యం కష్టపడతారు.  ఈ జీవన విధానం క్రీడలకు సరిగ్గా సరిపోతుంది.

ప్రాతినిధ్యం..

ఇక్కడి ప్రజలు తమ ప్రాంతానికి.. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వకారణంగా భావిస్తారు. అందువల్ల వీరు అవకాశాల కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

అన్నిటికీ మించి ఈశాన్యరాష్ట్రాల్లో ఉండే జీవనశైలి వీరికి ప్రత్యేకతను ఆపాదిస్తుంది. చిన్నతనం నుంచే చదువు కోసం కానీయండి.. పొలంలో పని కోసం కానీయండి ప్రతి ఒక్కరూ కనీసం 20 కిలోమీటర్లు రోజూ కాలినడకన వెళతారు. ఇది వారికి స్వతహాగానే అథ్లెటిక్ బాడీని అందిస్తుంది. అందుకే వీరు అథ్లెటిక్స్ లో రాణించగలుగుతున్నారు. ఈశాన్యరాష్ట్రాల క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించి మెడల్స్ తేవడం వెనుక ముఖ్యంగా ఉన్నది వారికి స్వతహాగా ఉన్న ప్రాకృతిక జీవన విధానమే. ప్రకృతితో మమేకం అయి జీవించడం వారి విజయాలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

Also Read: PV Sindhu Photoshoot: స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు లేటెస్ట్ ఫోటోషూట్

Paralympics 2020: పారాలింపిక్స్ కోసం అంతా సిద్ధం..ఎన్ని దేశాలు.. ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారో తెలుసా?