‘వారికో లెక్క. మాకో లెక్కా..!’ అంటూ అధికారులపై మండిపడుతున్న మండలి మాజీ పెద్దలు, పీక్స్‌కు చేరిన ప్రోటోకాల్ రగడ

వారంతా పెద్దల సభలో పెద్ద పెద్ద స్థానాల్లో పనిచేసిన వ్యక్తులు. పదవి కాలం ముగియడంతో ప్రస్తుతం రెన్యూవల్ కోసం ఎదురుచూస్తూనే.. ప్రోటోకాల్

'వారికో లెక్క. మాకో లెక్కా..!' అంటూ అధికారులపై మండిపడుతున్న మండలి మాజీ పెద్దలు, పీక్స్‌కు చేరిన ప్రోటోకాల్ రగడ
Telangana
Follow us

|

Updated on: Aug 23, 2021 | 12:55 PM

Former MLC’s of Telangana Legislative Council: వారంతా పెద్దల సభలో పెద్ద పెద్ద స్థానాల్లో పనిచేసిన వ్యక్తులు. పదవి కాలం ముగియడంతో ప్రస్తుతం రెన్యూవల్ కోసం ఎదురుచూస్తూనే.. ప్రోటోకాల్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శాసన మండలి మాజీ చైర్మన్‌కు ఎప్పటిలా ఇస్తున్న సౌకర్యాలు మాకు ఎందుకు ఇవ్వరు? అంటూ అధికారులపై ఒత్తిడి చేయడంతో ఏం చెయ్యాలో తెలియక అధికారులు తలల పట్టుకుంటున్నారు.

కట్ చేస్తే, తెలంగాణ శాసన మండలి మాజీల మధ్య ప్రోటోకాల్ రగడ ఇప్పుడు పీక్స్ కు చేరింది. ‘వారికో లెక్క.. మాకొ లెక్కా..’ అంటూ అధికారులపై మండిపడుతున్నారు. ఈ మధ్యనే శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లతో పాటు మండలి చిప్ విప్ పదవి కాలం ముగియడంతో ప్రస్తుతం వారంతా మాజీలయ్యారు. మళ్ళీ రెన్యూవల్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే శాసన మండలికి ప్రొటెం స్పీకర్‌ను కూడా నియమించారు.

సాధారణంగా పదవీ కాలం ముగిసిన నేతలకు రెగ్యులర్ గా ఇచ్చే ప్రోటోకాల్ తో పాటు వివిధ సౌకర్యలను వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. కొన్ని సందర్భల్లో ప్రభుత్వం నుండి ప్రత్యేక ఆదేశాలు వస్తే మాత్రం వారు మాజీలు అయినా యధావిధిగా కొనసాగిస్తారు. ఉదాహరణకు స్వర్గీయ మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విషయంలో కూడా ఆయన క్యాబినెట్‌లో లేకున్నా ముఖ్యమంత్రి అదేశాలతో మంత్రుల నివాసంలో ఆయనకు క్వాటర్ కొనసాగించారు.

ఇటు, మండలి మాజీ చెర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విషయంలోనూ ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు ఆయనకు ప్రోటోకాల్‌ను యధావిధిగా కొనసాగించడం కొంత మంది మాజీలకు మింగుడుపడటం లేదు. దీనిపై ఒక మాజీ డిప్యూటీ చైర్మన్ ఒక అడుగు ముందుకు వేసి అధికారులను గట్టిగానే ప్రశ్నిస్తున్నారని సమాచారం. “నాకు ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. మాజీ చైర్మెన్‌కు ఎందుకు ఇస్తున్నారు.. ఇస్తే నాకు కూడా ఇవ్వండి లేదా ఆయనకు తొలగించండి అంటూ అధికారుల పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయనతో పాటు ఇన్నాళ్లూ ప్రోటోకాల్ అనుభవించిన పెద్దలంతా మీదకు అధికారులను అడగకున్నా.. లోలోపల మాత్రం గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

పెద్దల సభ మాజీల ప్రోటోకాల్ విషయంలో ఇలా ఒత్తిళ్లు రావడంతో ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకు వద్దని చెప్పలేక.. వీరికి కుదరదు అని చెప్పలేక సతమతం అవుతున్నారని సమాచారం.

శ్రీధర్ ప్రసాద్, రిపోర్టర్, టీవీ9 తెలుగు

Read also: GVL: వైసీపీ, టీడీపీ ఎంతమంది బీసీలను, రాజ్యసభకు పంపారో చెప్పాలి: జీవీయల్