GVL: వైసీపీ, టీడీపీ ఎంతమంది బీసీలను, రాజ్యసభకు పంపారో చెప్పాలి: జీవీయల్
సామాజిక సాధికారత దేశంలో బీజేపీకి మాత్రమే సాధ్యమైందని బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహరావు చెప్పారు. అన్ని సామాజిక వర్గాలను రాజకీయ పార్టీలు
GVL Narasimha Rao: సామాజిక సాధికారత దేశంలో బీజేపీకి మాత్రమే సాధ్యమైందని బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహరావు చెప్పారు. అన్ని సామాజిక వర్గాలను రాజకీయ పార్టీలు కేవలం తమ తమ రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. వ్యక్తులకు లబ్ది చేకూరినంత మాత్రాన సామజికంగా అన్ని వర్గాలకు న్యాయం చేకురినట్లు కాదని జీవీఎల్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
టీడీపీ, వైసీపీలు కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించిన బీజేపీ ఎంపీ.. “మెడికల్ సీట్లలో 27శాతం బీసీలకు వచ్చేలా ప్రధాని మోదీ చేశారు. రోహిణి కమిషన్ ఆదేశాలను దేశంలో సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టింది మోదీ సర్కారు. సామజిక న్యాయం సామాజిక ఏజండాగా అమలు అవ్వాలి కానీ .. రాజకీయ ఎజెండాగా అమలు అవ్వకూడదు. ఓబీసీ, ఎస్సీలలో కొన్ని వర్గాలకు జరిగిన అన్యాయంపై రాజకీయా వేదికపై చర్చిస్తాం. వైసీపీ, టీడీపీ అధికారంలో ఉండగా ఎంతమంది బీసీలను, రాజ్యసభకు పంపారో స్పష్టంగా చెప్పాలి.” అని నరసింహరావు అన్నారు.
కార్పొరేషన్లు పెట్టామని పబ్లిసిటీ చేసుకోవడమే తప్ప సామాజిక సాధికారిక ఎక్కడ ఉందో టీడీపీ, వైసీపీ చెప్పాలని డిమాండ్ చేసిన జీవీఎల్..”సోషల్ జస్టిస్ ఎజెండాపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా. సామాజిక సాధికారిక ఎజెండాపై అన్ని రాజకీయా పార్టీలు బహిరంగంగా చర్చకు రావాలి. బీజేపీ, జనసేన ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం. వైసీపీ అధికార మదంతో వ్యవహరిస్తోంది. ఏపీలో రాజకీయా సూన్యత ఉంది.” అని జీవీఎల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read also: మొరిపిరాల లవ్ చీటింగ్ కేసులో కొత్త కోణాలు.. సందీప్ కుమార్‌ను బలితీసుకున్న హానీ ట్రాప్.!