NBF స్వయం నియంత్రణ సంస్థను అధికారికంగా గుర్తించిన కేంద్ర సమాచార శాఖ..
న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (NBF) ఆధీనంలోని స్వీయ నియంత్రణ సంస్థ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) అధికారికంగా గుర్తించింది. MIB ద్వారా NBF అధికారిక హోదాను పొందడం ద్వారా దేశంలో..

NBF: న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (NBF) ఆధీనంలోని స్వీయ నియంత్రణ సంస్థ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) అధికారికంగా గుర్తించింది. MIB ద్వారా NBF అధికారిక హోదాను పొందడం ద్వారా దేశంలో అక్రెడిటేషన్ పొందిన ఈ తరహా ఏకైక సంస్థగా గుర్తింపు దక్కించుకుంది. NBF స్వీయ నియంత్రణ సంస్థ భారత యూనియన్ ధృవీకరణను మంజూరు చేయడానికి అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఏకైక సంస్థగా ఆవిర్భవించింది. తాజాగా వార్తా మీడియా రంగాన్ని నియంత్రించే ఏకైక గుర్తింపు పొందిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. పారదర్శకత, జవాబుదారీతనం, బలమైన స్వీయ నియంత్రణ వంటి లక్ష్యాలతో సంస్థ ముందుకు వెళ్తోంది.
భారతదేశంలో అతిపెద్ద వార్తా ప్రసారక సంస్థగా ఇప్పటికే NBF గుర్తింపు తెచ్చుకుంది. వార్తా మాధ్యమ రంగంలో స్వీయ నియంత్రణ చట్రాన్ని బలోపేతం చేయడానికి పరిశ్రమలోని సభ్య సమూహాలు, వాటాదారులతో నిరంతరం కలిసి పని చేస్తోంది. NBF ప్రొఫెషనల్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ స్టాండర్డ్స్ అథారిటీ (‘PNBSA’) భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థ కావడంతో.. ఈ సంస్థ పారదర్శకత, జవాబుదారీతనం అత్యున్నత ప్రమాణాలతో బలమైన వ్యవస్థను నిర్మించడానికి సిద్ధమవుతోంది. దీంతో ఇది డొమైన్‌లో సాటిలేని ఉదాహరణగా నిలిచింది.
ప్రస్తుతం భారతదేశంలో వార్తా మాధ్యమంలో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విజయవంతంగా ప్రదర్శించిన ఏకైక సంస్థ PNBSA. ఈ అక్రిడిటేషన్ అనేది NBF , PNBSA పనిచేసే ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలు, శ్రేష్ఠతకు మరొక చిహ్నంగా నిలుస్తోంది. వార్తా మాధ్యమాల కోసం గుర్తింపు పొందిన ఏకైక స్వీయ నియంత్రణ సంస్థగా PNBSA కఠినమైన పరిశీలనకు గురైంది. NBF ఇప్పటికే మీడియా సంస్థలకు కీలక కేంద్రంగా మారింది. ఇది భారతదేశంలో అతిపెద్ద వార్తా ప్రసారాల సమూహంగా నిలిచింది.
కాగా, NBFలో ప్రస్తుతం 24 న్యూస్, సహారా, CVR ఇంగ్లీష్, CVR హెల్త్, CVR NEWS, DA న్యూస్ ప్లస్, DY365, గులిస్తాన్ న్యూస్, IBC24, IND 24, ఇండియా న్యూస్ గుజరాత్, ఇండియా న్యూస్ హర్యానా, ఇండియా న్యూస్ హిందీ, ఇండియా న్యూస్, ఇండియా న్యూస్ పంజాబీ, ఇండియా న్యూస్ రాజస్థాన్, ఇండియా న్యూస్ UP, ఖబర్ ఫాస్ట్, MHOne, NEWS9, న్యూస్ ఫస్ట్ కన్నడ, న్యూస్ లైవ్, న్యూస్ నేషన్, న్యూస్ ఎక్స్, నార్త్ ఈస్ట్ లైవ్, నార్త్ ఈస్ట్ న్యూస్, OTV, ప్రాగ్ న్యూస్, పుతియతలైమురై, రిపబ్లిక్ బంగ్లా, రిపబ్లిక్ భారత్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: Jewellers businessmen: వద్దేవద్దు.. గోల్డ్‌పై హాల్‌మార్కింగ్‌కు వ్యతిరేక గళం.. ఇవాళ వ్యాపారుల నిరసన
