Minister Botsa: న్యాయస్థానాన్ని ఒప్పిస్తాం.. న్యాయస్థానం ఆదేశాలతోనే వెళ్తాం.. మూడు రాజధానులపై మంత్రి బొత్స
ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టు విచారణ వాయిదా కోరడంలో మతలబు ఎంటని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
AP Minister Botsa Satyanarayana: ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టు విచారణ వాయిదా కోరడంలో మతలబు ఎంటని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సజావుగా సాగుతున్న విచారణను పదే పదే వాయిదా వేయమని హైకోర్టు కోర్టును కోరడం వెనుక అంతర్యమేంటని బొత్స ప్రశ్నించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా రాజధాని వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేయాలంటూ పిటిషనర్లు, వాళ్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేయడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇలా స్పందించారు. వాయిదా వేయాలని అడగడంలో ఎదైనా దురుద్దేశం ఉందా అని ఆయన ప్రశ్నించారు
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. ఇందులో ఏమాత్రం అనుమానాలకు తావులేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదన్నారు. న్యాయస్థానాన్ని ఒప్పిస్తామని, న్యాయస్థానం ఆదేశాలతోనే వెళ్తామని ప్రకటించారు. రాజధాని అమరావతి కేసులో రోజువారీ విచారణ జరుగుతుందని హైకోర్టే చెప్పిందని గుర్తుచేశారు.