Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: పంజ్‌షీర్ లోయకు వందలాది మంది తరలుతున్న తాలిబన్లు.. ట్విటర్‌లో14 సెకండ్ల వీడియో

Afghanistan: తాలిబన్లను చూసి ఆఫ్ఘనిస్థాన్ ప్రజలంతా గజగజ వణికిపోతున్నా.. పంజ్‌షిర్ లోయ మాత్రం వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు స్థానికులు. రోజురోజుకూ..

Afghanistan: పంజ్‌షీర్ లోయకు వందలాది మంది తరలుతున్న తాలిబన్లు.. ట్విటర్‌లో14 సెకండ్ల వీడియో
Follow us
Subhash Goud

|

Updated on: Aug 23, 2021 | 9:57 PM

Afghanistan: తాలిబన్లను చూసి ఆఫ్ఘనిస్థాన్ ప్రజలంతా గజగజ వణికిపోతున్నా.. పంజ్‌షిర్ లోయ మాత్రం వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు స్థానికులు. రోజురోజుకూ అక్కడ తాలిబన్లకు వ్యతిరేకత పెరిగిపోతూ ఉండటంతో.. మొత్తం దేశమంతా తమకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుందేమో అని అలర్ట్ అయిన తాలిబన్లు.. పంజ్‌షిర్ లోయకు వందల మంది తమ సైన్యాన్ని పంపిస్తున్నారు. ఆ లోయలో ప్రజలను ముందుండి నడిపిస్తున్న… నేషనల్ రెసిస్టాన్స్ ఫ్రంట్‌ చీఫ్ అహ్మద్ మస్సూద్.. తాలిబన్లతో చర్చలు జరుపుతామని అన్నారు. కానీ అలాంటి చర్చలు ఏవి జరగలేవు. యుద్ధమే జరిగేలా ఉంది. స్థానిక ప్రజలకు, కొన్ని విప్లవ శక్తులకూ చర్చలు ఇష్టం లేవు.

పంజ్‌షిర్ లోయను తమకు అప్పగించాలని తాలిబన్లు కోరగా.. స్థానిక నేతలు అందుకు ఒప్పుకోలేదు. ఆఫ్ఘనిస్థాన్ అంతా తాలిబన్ల వశం అయినా.. తమ ప్రాంతాన్ని మాత్రం అప్పగించేది లేదని అన్నారు. దాంతో తాలిబన్లు యుద్ధం చేసైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో 14 సెకండ్ల వీడియో క్లిప్ పెట్టారు. అందులో పంజ్ షిర్ సరిహద్దుల్లో కొన్ని ట్రక్కులను స్వాధీనం చేసుకున్నట్లుగా చూపించారు. వాటిపై తాలిబన్ల జెండాలు ఉండటాన్ని చూడవచ్చు.

అహ్మద్ మస్సూద్… అహ్మద్ షా మస్సూద్ కొడుకు. అహ్మద్ షా మస్సూద్.. 1980లో ఆఫ్ఘనిస్థాన్‌లో యాంటీ-సోవియట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అదే విధంగా అహ్మద్ మస్సూద్.. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. మా లోయలోకి వచ్చే తాలిబన్లు మాతో చర్చలకు రావాలే తప్ప.. యుద్ధానికి దిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని అహ్మద్ మస్సూద్ హెచ్చరించారు. కాగా, ఈ పంజ్‌షిర్ లోయ అనేది… రాజధాని కాబూల్‌కి వాయవ్య దిశలో ఉంది. అక్కడ మొదటి నుంచి తాలిబన్లకు పట్టు లేదు. ఎన్నోసార్లు అక్కడ అడుగుపెట్టి తాలిబన్లు చావుదెబ్బ తిన్నారు. ఇప్పుడు కూడా వారికి అదే గతి పడుతుందని స్థానిక సైనికులు చెబుతున్నారు. పంజ్‌షిర్ లోయలో తాలిబన్లకు ఈసారి కూడా ఎదురుదెబ్బ తగిలితే.. మొత్తం ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజల్లో అది ధైర్యాన్ని పెంచుతుంది. వారంతా తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితి రాకూడదనే.. తాలిబన్లు.. హడావుడిగా పంజ్‌షిర్ లోయవైపు భారీ బలగాలతో తరలి వెళ్తున్నారు.

కాగా, తాలిబన్ వ్యతిరేకులు తాజాగా.. పంజ్‌షిర్ సరిహద్దులోని బగ్లాన్ ఉత్తరప్రావిన్స్‌లో ఉన్న మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ వెనక తాను లేననీ, స్థానిక మిలీషియా గ్రూపులే స్వాధీనం చేసుకున్నాయని అహ్మద్ మస్సూద్ చెబుతున్నాడు. తాజాగా విషయం ఏంటంటే ఆ మూడు జిల్లాల్లో బాను జిల్లాను తిరిగి తాలిబన్లు లాక్కున్నారు. మిగతా 2 జిల్లాల్ని కూడా లాక్కునేందుకు యుద్ధం జరుగుతోంది.

ఇవీ కూడా చదవండి:

Taliban Panjshir: తాలిబన్లకు కొరకరాని కొయ్యగా మారిన అందాల లోయ.. పంజ్‌షిర్‌ నుంచి సింహగర్జన..!

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్ శరణార్థుల పట్ల ఒక్కో దేశం ఒక్కో వైఖరి.. వారిని అనుమతిస్తున్న దేశాలు ఇవే..