Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తీవ్ర పోరాటం..50 మంది తాలిబన్ సైనికుల హతం..బందీలుగా 20 మంది!
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ నుండి బయటపడిన ఏకైక ప్రాంతం అయిన పంజ్‌షీర్‌లో పోరాటం ప్రమాదకరమైన మలుపు దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాలలో పంజ్‌షీర్ లోయ ఒకటి.
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ నుండి బయటపడిన ఏకైక ప్రాంతం అయిన పంజ్‌షీర్‌లో పోరాటం ప్రమాదకరమైన మలుపు దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాలలో పంజ్‌షీర్ లోయ ఒకటి. ఆంధ్రాబ్‌లో జరిగిన పోరులో 50 మందికి పైగా తాలిబాన్ యోధులు మరణించారని, 20 మందికి పైగా యోధులు బందీలుగా ఉన్నారని పంజ్‌షీర్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. జరిగిన ఈ పోరాటంలో ముగ్గురు సహచరులతో పాటు తాలిబాన్ ప్రాంతీయ కమాండర్ ఒకరు మరణించినట్లు తాలిబాన్ కు చెందిన మరో ప్రాంతీయ కమాండర్ ప్రకటించాడు. అదే సమయంలో, పంజ్‌షీర్‌కు మద్దతు ఇచ్చే ఒక ఫైటర్ మరణించాడు మరియు 6 మంది గాయపడ్డారు. అయితే, తాలిబాన్ వర్గాలు దీనిని ధృవీకరించలేదు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఇంకా ఆక్రమించని కొన్ని ప్రాంతాలలో పంజ్‌షీర్ లోయ ఒకటి. ఇక్కడ తిరుగుబాటుదారులకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (నార్తర్న్ అలయన్స్) కు నాయకత్వం వహిస్తున్న మసూద్, యుద్ధానికి సన్నద్ధత ఉందని, అయితే శాంతి కోసం ఒక మార్గం కోసం చర్చలు జరిపితే, వారు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
తాలిబాన్ వాదన – పంజ్‌షీర్ మూడు వైపులా చుట్టుముట్టారుట్టాం..
తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ పంజ్‌షీర్ లోయను మూడు వైపులా చుట్టుముట్టినట్లు తెలియజేశారు. ట్విట్టర్‌లో ‘ఎమిరేట్స్ శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు.’ ఉత్తర కూటమి, ఆఫ్ఘన్ సైన్యం మరియు కొన్ని ఇతర తిరుగుబాటు యోధులు ఇక్కడ తాలిబాన్లకు వ్యతిరేకంగా నిలబడ్డారు. పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతున్న తాలిబాన్లు, అమ్రుల్లా సలేహ్, అహ్మద్ మసూద్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. సలేహ్ ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్, కానీ అష్రఫ్ ఘని దేశం విడిచి వెళ్లిన తర్వాత తనకి తాను అధ్యక్షుడిగాప్రకటించుకున్నారు. అదే సమయంలో అతను పంజ్‌షీర్‌కు వెళ్లి, ఇక్కడ అహ్మద్ మసూద్‌తో చేతులు కలిపాడు.
తాలిబాన్ వెళ్లే మార్గంలో పొంచి ఉన్న పంజ్‌షీర్ దాడిలో తాలిబాన్ 300 మంది సైనికులను హతమార్చినట్టు వస్తున్న వార్తలపై తాలిబన్లు స్పందించారు. పోరాట యోధులు మరణించిన వార్తలను తాలిబాన్ ఖండించింది. ప్రస్తుతం పంజ్‌షీర్‌లోని రెండు జిల్లాలను ఆక్రమించినట్లు తాలిబాన్ తెలిపింది. తాలిబాన్‌లతో వేలాది మంది ప్రజలు సురక్షితంగా లేరని భావిస్తూ పంజ్‌షీర్‌కు పారిపోతున్నారు. ఈ ప్రాంతం ఉత్తర కూటమితో కలిసి తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది.
పంజ్‌షీర్‌నుంచి తాలిబాన్‌ల పై యుద్ధం చేయడానికి అహ్మద్ మసూద్, పంజ్‌షీర్‌లోని తిరుగుబాటు నాయకులలో చేరారు. ఆఫ్ఘన్ దళాలు, తాలిబాన్ తిరుగుబాటుదారులు కూడా ఇక్కడకు చేరుకున్నారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రతినిధి అలీ మైసామ్ నజారీ AFP వార్తా సంస్థతో మాట్లాడుతూ, తాలిబాన్‌లకు వ్యతిరేకంగా సుమారు 9,000 మంది సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సైన్యానికి నిరంతర శిక్షణ ఇస్తున్నారు. మా వద్ద వాహనాలు, ఆయుధాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాన్ని నడపడానికి మేము ఒక కొత్త వ్యవస్థను కోరుకుంటున్నాము. దాని కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నామని, అయితే అవసరమైతే, మేము పోరాటం నుండి వెనక్కి తగ్గము అని నజారీ అన్నారు.