AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ సర్కార్ డెసిషన్.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు..

జగన్ సర్కార్ డెసిషన్.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ..
Biometric
Ravi Kiran
|

Updated on: Aug 24, 2021 | 7:43 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కీలక ఉత్తర్వులకు జారీ చేశారు. కరోనా కారణంగా గతేడాది మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరుకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 13వ తేదీన అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ ఆదిత్యనాధ్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బయోమెట్రిక్ హాజరును పునరుద్దరించాలనే అంశంపై కీలకంగా చర్చించారు. ప్రభుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు హ‌జ‌రుపైనా చ‌ర్చ జ‌రిగింది.

చాలా మంది కార్యాల‌యాల‌కు టైంకు రాక‌పోవ‌డం.. వ‌చ్చినా బ‌య‌ట‌కు వెళ్ల‌డం.. స‌మ‌యం పూర్తి కాక‌పోయినా ముందుగానే ఆఫీసుల నుండి వెళ్లిపోవ‌డం వంటి విషయాలను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బ‌యోమెట్రిక్ హ‌జ‌రును పున‌రుద్దించాల‌ని సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆదేశించారు. ఈ క్రమంలోనే సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖకు తెలిపారు.

ఇకపై హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు, సచివాలయాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని మెమోలో పేర్కోన్నారు. బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారీగా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని.. ప్రతీశాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని సూచించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, జిల్లా కలెక్టర్‌లకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలను జారీ చేశారు.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్