Aadhaar Card: ఆధార్ కార్డులో పేరుతో పాటు ఇతర వివరాలు మార్చుకోవాలా..? ఈ డాక్యుమెంట్లలో ఏదైనా సమర్పించవచ్చు..!

Aadhaar Card: ప్రస్తుతం అన్ని అవసరాలకు ఉపయోగపడే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఒకటి. ఆధార్ ఇప్పడు చాలా వాటికి అవసరం..

Aadhaar Card: ఆధార్ కార్డులో పేరుతో పాటు ఇతర వివరాలు మార్చుకోవాలా..? ఈ డాక్యుమెంట్లలో ఏదైనా సమర్పించవచ్చు..!
Aadhaar Card
Follow us

|

Updated on: Aug 24, 2021 | 7:36 PM

Aadhaar Card: ప్రస్తుతం అన్ని అవసరాలకు ఉపయోగపడే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఒకటి. ఆధార్ ఇప్పడు చాలా వాటికి అవసరం అవుతుంది. ఇది లేకపోతే పనులు జరగవు. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలకు, ఇతర వాటికి కూడా ఎంతో అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాలు పొందాలన్నా తప్పకుండా ఆధార్‌ కావాల్సిందే. అందువల్ల ఆధార్ కార్డు చాలా కీలకమైందని చెప్పవచ్చు. అందువల్ల ఆధార్‌ కార్డులో వివరాలు కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వాటిల్ల ఏమైనా తప్పులు ఉంటే.. సులభంగానే సరిచేసుకోవచ్చు.

అయితే వివరాలు సరిచేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. యూఐడీఏఐ ప్రకారం.. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం 32 రకాల డాక్యుమెంట్లు పని చేస్తాయి. ఇందులో కొన్నింటిని మీకు తెలియజేస్తున్నాము.

ఆధార్‌లో మార్పులు చేసేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు:

► పాస్‌పోర్ట్ ► పాన్ కార్డు ► రేషన్ కార్డు ► ఓటర్ కార్డు ► బ్యాంక్ స్టేట్‌మెంట్ ► ఎలక్ట్రిసిటీ బిల్లు ► డ్రైవింగ్ లైసెన్స్ ► వాటర్ బిల్లు ► పాస్‌బుక్ ► పోస్టాఫీస్ అకౌంట్ స్టేట్‌మెంట్ ► బర్త్ సర్టిఫికెట్ ► విద్యకు సంబంధించిన మార్క్ షీట్ ► ఫ్రీడమ్‌ ఫైటర్‌ ఫోటో ఐడీ కార్డు ► ఆర్మీకి సంబంధించిన ఐడీ కార్డు ► పెన్షన్‌ కార్డు ► కిసాన్‌ ఫోటో పాస్‌బుక్‌ ► రాష్ట్రీయ బీమా యోజన కార్డు ► ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్‌ కార్డు ► గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఐడీ కార్డు ► ఏదైనా పథకాలకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన కార్డులను సమర్పించవచ్చు.

ఆధార్‌లో మార్చండిలా..

➦ ఆధార్ కార్డు హోల్డర్లు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ https://ssup.uidai.gov.in/ssup/ ఓపెన్ చేయాలి. ➦ Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి. ➦ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ➦ క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ➦ Sent OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ➦ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. ➦ మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ➦ అందులో పుట్టిన తేదీని మార్చాలి. ➦ యూఐడీఐఏ సూచించిన ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ➦ ఏ డాక్యుమెంట్స్‌ని యూఐడీఐఏ అనుమతి ఇస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ➦ ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత Submit పైన క్లిక్ చేయాలి.

➦ మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలను, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌ని పరిశీలించి యూఐడీఏఐ మీ పుట్టిన తేదీని, ఇతర వివరాలను సరిచేస్తుంది. మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ► Check Update Status పైన క్లిక్ చేయండి. ► ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయండి. ► మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. ► Check Status పైన క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుస్తుంది.

ఇవీ కూడా చదవండి:

LIC Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.40 పొదుపుతో.. ఏటా రూ.40 వేలు పొందవచ్చు..!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..