Indian Railway Recruitment 2021: రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక
Indian Railway Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. పలు సంస్థలు వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న..
Indian Railway Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. పలు సంస్థలు వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా ఇండియన్ రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కొంకణి రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) జమ్మూకశ్మీర్‌లో నిర్వహించే ప్రాజెక్టు కోసం టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూల ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో ఎంపిక చేయబడుతుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. నోటిఫికేషన్ ప్రకారం.. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.30,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది. అలాగే సంవత్సరం తర్వాత వేతనంలో 10 శాతం పెంచనున్నారు.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు కోసం ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరుగనున్నాయి.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) మొత్తం ఖాళీలు – 7 జీతం: రూ.35,000
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) మొత్తం ఖాళీలు -7 జీతం: రూ.30,000
విద్యార్హతలు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) అభ్యర్థులు బీఈ/బీటెక్ కోర్సులను సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చేసి ఉండాలి. ఈ కోర్సుల్లో 60 శాతం మార్కులను సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) అభ్యర్థులు బీఈ/బీటెక్ కోర్సులను 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి. వెబ్‌సైట్ నుంచి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇంటర్వ్యూ చిరునామా:
USBRL Project Head Office, Konkan Railway Corporation Ltd., Satyam Complex, Marble Market, Extension-Trikuta Nagar, Jammu, Jammu and Kashmir (U.T). PIN 180011.