Schools Reopen: సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు బంద్‌.. విద్యా సంస్థల పునఃప్రారంభంపై మంత్రి ఏమన్నారంటే.

Schools Reopen: కరోనా కారణంగా పూర్తిగా అతాలాకుతలమైన విద్యా వ్యవస్థను మళ్లీ దారిలో పెట్టే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 1నుంచి...

Schools Reopen: సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు బంద్‌.. విద్యా సంస్థల పునఃప్రారంభంపై మంత్రి ఏమన్నారంటే.
Telangana Schools
Follow us

|

Updated on: Aug 24, 2021 | 3:46 PM

Schools Reopen: కరోనా కారణంగా పూర్తిగా అతాలాకుతలమైన విద్యా వ్యవస్థను మళ్లీ దారిలో పెట్టే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 1నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో సుమారు ఏడాదిన్నరగా మూగబోయిన బడి గంటలు మళ్లీ మోగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

స్కూళ్ల పునఃప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్‌ క్లాసులు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. ఆన్లైన్‌లో క్లాసుల నిర్వహణ లేదని తేల్చి చెప్పారు. ప్రతి విద్యార్థి తప్పని సరిగా స్కూల్ కి రావాల్సిందేనన్నారు. ఇక ఫీజుల విషయంలో ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు.  జీ ఓ నెంబర్ 46 ప్రకారం ఫీజులు మాత్రమే వసూలు చేయాలని తెలిపారు. పిల్లలను తిరిగి పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉన్నారని మంత్రి వివరించారు. కరోనా పరిస్థితులలను అంచనా వేశాకే పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

పాఠశాలలో పారిశుధ్య బాధ్యతలను సర్పంచ్‌, కార్పొరేటర్‌, మేయర్‌లే చూసుకోవాలని మంత్రి తెలిపారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారన్నదానిపై ప్రతి రోజూ డిఈఓ నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటామని మంత్రి అన్నారు. కరోనా భయం ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో వెల్ఫేర్‌ హాస్టల్స్‌లో ఒక ఐసోలేషన్‌ గదిని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఇక విద్యార్థుల రవాణా విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Errabelli

 ప్రతీ విద్యార్థిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే..

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలను ప్రత్యక్ష బోధనకు అనువుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు చాలా రోజులుగా మూతపడ్డ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ పరిధిలోని సిబ్బంది సహకారంతో చెత్తను తొలగించాలని ఆదేశించారు. ఇక జిల్లా పరిషత్ పరిధిలోని నిధులు సైతం పారిశుధ్యానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ విషయమై ఆగస్ట్ 30న హెడ్ మాస్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలలను శుభ్రంగా లేకపోతే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

ఇందులో భాగంగా ప్రతి పాఠశాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేశామని, ఒక్కో పాఠశాలలు ఏఎన్ఎం కేటాయించామని మంత్రి తెలిపారు. ఏదైనా అనుమానం వస్తే విద్యార్థులకు వెంటనే కరోనా పరీక్షలు పాఠశాలలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. నిరంతరం పాఠశాలలపై మానిటరింగ్‌ ఉంటుందని తెలిపిన మంత్రి ప్రతి విద్యార్థిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. అన్ని పాఠశాలల్లో మాస్కులు అందుబాటులో ఉంచుతామన్నారు.

Also Read: Indian Railway Recruitment 2021: రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక

Schools Reopen: తెలంగాణలో మోగనున్న బడి గంటలు.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

AP Weather ఏపీలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు: వాతావరణ శాఖ