Aadhaar Update: భారీ క్యూ లైన్‌లు.. తప్పని తిప్పలు.. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం రాత్రంతా అక్కడే.

Adhar Update: ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ట్రైన్‌ టికెట్‌ నుంచి సిమ్‌ కార్డు వరకు అన్నింటికి ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఇక ప్రభుత్వ పథకాలను పొందాలనుకునే వారికి కూడా ఆధార్‌..

Aadhaar Update: భారీ క్యూ లైన్‌లు.. తప్పని తిప్పలు.. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం రాత్రంతా అక్కడే.
Adhaar Card Update Problems
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 25, 2021 | 7:27 AM

Aadhaar Update: ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ట్రైన్‌ టికెట్‌ నుంచి సిమ్‌ కార్డు వరకు అన్నింటికి ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఇక ప్రభుత్వ పథకాలను పొందాలనుకునే వారికి కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో ఆధార్‌ కార్డ్‌లో పేరు, అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ను మార్చుకోవడానికి జనాలు ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఆధార్‌లో సరైన సమాచారం లేకపోతే ఎక్కడ ప్రభుత్వ పథకాలు అందవోనని ప్రజలు ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాల వద్ద భారీగా క్యూ కడుతున్నారు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కనిపించిన ఓ సంఘటన ఆధార్‌ కోసం ప్రజలు పడుతోన్న అవస్థలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. పిల్లల వేలి ముద్రలు అప్‌డేట్‌ కాకపోతే రేషన్‌ రాదన్న ప్రచారంతో ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ కోసం ప్రజలు బ్యాంకులు, పోస్టాఫీస్‌ వద్ద బారులు తీరుతున్నారు. తణుకు పోస్టాఫీస్‌ వద్ద కొందరు తమ పిల్లలతో సహా రాత్రంతా అక్కడే నిద్రించారు. రోజుకి కేవలం 20 మందికే ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉండడంతో ఎక్కడ అవకాశం దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందిన ప్రజలు రోడ్డుపైనే నిద్రించారు. ఆధార్‌ సెంటర్‌లో రోజుకి 20కి మించి అప్లికేషన్‌లు ప్రాసెస్‌ కాకపోవడంతోనే ఇలా రాత్రంగా జాగారం చేయాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ బాధల నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు.

Also Read: BJP – Congress: కాంగ్రెస్ చీఫ్‌కు చుక్కలు చూపిస్తున్న సలహాదార్ల కామెంట్స్‌.. రాహుల్‌ను టార్గె్ట్ చేసిన బీజేపీ..

Coronavirus: భారతీయులు సంక్రమణతో జీవించడం నేర్చుకుంటారు.. కరోనా ఏ దశలో చెప్పిన డబ్ల్యూహెచ్‌ఓ

Social Media Effect: ఫేస్ బుక్ స్నేహితులు.. పేదింటి అమ్మాయి పెళ్లి చేశారు..