AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో భూప్రకంపనలు సునామీకి దారి తీస్తాయా..! ఆందోళన చెందుతున్న తీర ప్రాంత వాసులు..

AP News: ప్రపంచంలో జరిగే విపత్తులను ముందుగా సముద్రంలో జరిగే అలజడులను బట్టి గుర్తిస్తారు. అటువంటి సముద్రం తీరంలో

సముద్రంలో భూప్రకంపనలు సునామీకి దారి తీస్తాయా..! ఆందోళన చెందుతున్న తీర ప్రాంత వాసులు..
Sea
uppula Raju
|

Updated on: Aug 25, 2021 | 8:03 AM

Share

AP News: ప్రపంచంలో జరిగే విపత్తులను ముందుగా సముద్రంలో జరిగే అలజడులను బట్టి గుర్తిస్తారు. అటువంటి సముద్రం తీరంలో ఒక్క సారిగా జరిగే మార్పులు దేనికి సంకేతం..? ఏపీలో పలు చోట్ల సముద్రం తీరంలో జరిగే మార్పులు భయాందోళన కలిగిస్తున్నాయి..! ఒక్కసారిగా తూర్పుతీరంలో అలజడి మొదలవ్వడంతో అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియడం లేదు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదితో పాటు కాకినాడ ఉప్పాడ వద్ద సముద్రంలో జరిగిన మార్పులు.. మరోప్రక్క సముద్రంలో భుప్రకంపనలు తీరప్రాంత వాసులను కలవర పెడుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారి తీరం కోతకు గురైంది. నెలరోజుల్లో 45మీటర్లు ముందుకు వచ్చింది. అంతేకాకుండా తీరంలో ఉండే గెస్ట్ హౌస్, కొన్ని గృహలు కొట్టుకుని పోయాయి. ఇప్పటికీ అంతర్వేది తీర ప్రాంతంలో సముద్రం ఉగ్రరూపం దాలుస్తుంది. ఇటు ఉప్పాడ తీరంలోను ఇదే పరిస్థితి నెలకొంది. గత రెండు వారాల క్రితం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉప్పాడ తీరం వెంబడి రాకాసి అలలు ఎగసిపడటంతో తీరప్రాంతం కోతకు గురైంది. సముద్రం ముందుకు వచ్చి ఉప్పాడ తీరం బీచ్ రోడ్డును తాకుతు కెరటాలు ఎగిసిపడుతున్నవి. కానీ నిన్న జరిగిన పరిణామం NGRI శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు. అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వచ్చి సముద్రపు అలలతో అల్లకల్లోలంగా మారింది..

కానీ ఉప్పాడ తీరం వెంబడి ఎగసిపడే కెరటాలతో అలజడి చేసే సముద్రం.. దీనికి భిన్నంగా సముద్రం కొన్ని మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ఒక్క సారిగా ఈ హఠాత్పరిణామంతో తీరప్రాంత వాసులలో అలజడి మొదలైంది. ఇది ఇలా ఉంటే బంగాళాఖాతంలో మంగళవారం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.1తీవ్రతతో భూకంపం రాగా.. చెన్నైలో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అంతర్వేది, రాజోలు, నరసాపురం, అమలాపురం,పాలకోల్లు వంటి ప్రాంతాల్లో సముద్రంలో భూమి కంపించింది. జిల్లాలో సముద్ర తీరంతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతంలో భూమి కంపించగా జనాలు భయాందోళనకు గురయ్యారు. పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయని సోషల్ మీడియాలో టీట్లువెల్లువెత్తాయి. తిరువన్మియూర్ఆళ్వార్‌పేట్, చెన్నైలోని సుముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ప్రకంపనలు వచ్చాయని వచ్చినట్లు ట్వీట్లలో పేర్కొన్నారు.

భూకంపంతోనే ప్రకంపనలు వచ్చినట్లు ఐఎండీ చెన్నై శాఖ ధ్రువీకరించింది. ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పింది. ఈ భూకంపం కాకినాడకు ఆగ్నేయంగా 296 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 320 కిలోమీటర్ల భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే సముద్ర అలలను పరిశీలిస్తున్నామని ముందస్తుగా సునామీపై అంచనా వేయలేమని మరికొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సముద్రంలో భూకంపానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా..? ప్రకంపనల కారణంగా సముద్రం ఒకచోట ముందుకు.. మరోచోట వెనక్కి వెళ్లిందా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

హైదరాబాద్ సునామీ హెచ్చరికల కేంద్రం నుంచి, NGRI శాస్త్రవేత్తలు కూడా ఈ పరిణామంపై లోతుగా పరిశీలించి చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా సముద్రతీరంలో అమావాస్య పౌర్ణమిలతో పాటు ఆటుపోట్లకు సహజంగా ముందుకు వెనక్కి వెళుతుంటాయి. కానీ ఒక్కసారిగా మీటర్ల కొద్ది వెనక్కి.. ముందుకి.. రావడం చూస్తూంటే సునామి వంటి భారీ విపత్తు పరిణామం జరుతుందా అనే అనుమానాలు సముద్ర తీర ప్రాంతవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Rep. satya

Viral Photos: ప్రపంచంలో ఈ 5 ప్రదేశాలకు మనుషులు వెళ్లడం నిషేధం..! ఎందుకో తెలుసా..?

Aadhaar Update: భారీ క్యూ లైన్‌లు.. తప్పని తిప్పలు.. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం రాత్రంతా అక్కడే.

Horoscope Today: ఈ రాశివారికి ప్రమోషన్లు లేదా ట్రాన్స్‌ఫర్‌లు.. వ్యాపారులకు లాభాలు..