Viral Photos: ప్రపంచంలో ఈ 5 ప్రదేశాలకు మనుషులు వెళ్లడం నిషేధం..! ఎందుకో తెలుసా..?
Viral Photos: ప్రపంచంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు వెళ్లడానికి మనుషులను అనుమతించరు. అలాంటి ఐదు ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
Updated on: Aug 25, 2021 | 7:35 AM

గ్రాండ్ పుణ్యక్షేత్రం: ఈ ప్రదేశం జపాన్‌లోని షింటో ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయంలో సామాన్యులకు ప్రవేశం నిషేధం. పూజారి కాకుండా, రాజ కుటుంబానికి చెందిన వారిని మాత్రమే అనుమతిస్తారు. ఈ ఆలయం గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతి 20 సంవత్సరాలకు వారు ఈ ఆలయాన్ని విచ్ఛిన్నం చేస్తారు తర్వాత దానిని మళ్లీ పునర్నిర్మిస్తారు.

సీక్రెట్ ఆర్కైవ్స్: ఈ ప్రదేశం వాటికన్ నగరంలో ఉంది. ఎవరూ ఇక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు. దీనికి కారణం శతాబ్దాల నాటి పుస్తకాలు, పత్రాలు ఈ ఆర్కైవ్‌లలో సేవ్ చేశారు.

ఫ్రాన్స్‌లోని లాస్కాస్ గుహ: ఈ గుహ 1940 లో కనుగొన్నారు. 20 వేల సంవత్సరాల కంటే పురాతనమైన ఈ గుహలో వేలాది ఆదిమ కాలపు చిత్రాలు ఉన్నాయి. ప్రజల సందర్శన ఇక్కడ నిషేధం. దీనికి కారణం ప్రమాదకరమైన కీటకాలు గుహలో నివసిస్తాయి.

హర్డ్ ద్వీపం: ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ప్రదేశం అగ్నిపర్వత ద్వీపం. ఈ ద్వీపం హిందూ మహాసముద్రం లోతుల నుంచి ఉద్భవించింది. దానిపై అగ్నిపర్వతం ఇప్పటికీ మండుతుంటుంది. అందుకే పర్యాటకులను ఇక్కడకు అనుమతించరు.

భూగర్భ విత్తన నిల్వ కేంద్రం: ప్రపంచవ్యాప్తంగా వివిధ జాతులకు చెందిన ఒక మిలియన్ విత్తనాలు ఇక్కడ భద్రపరిచారు. ఇది పర్వతాలలో నిర్మించారు. ఇక్కడికి వెళ్లడానికి ఎవరికి అనుమతి లేదు. ఇక్కడ పనిచేసే వారు మాత్రమే ఇక్కడికి వెళతారు.





























