Horoscope Today: ఈ రాశివారికి ప్రమోషన్లు లేదా ట్రాన్స్‌ఫర్‌లు.. వ్యాపారులకు లాభాలు..

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది.

Horoscope Today: ఈ రాశివారికి ప్రమోషన్లు లేదా ట్రాన్స్‌ఫర్‌లు.. వ్యాపారులకు లాభాలు..
Horoscope Today
Follow us
uppula Raju

|

Updated on: Aug 25, 2021 | 7:29 AM

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. బుధవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..

మేష రాశి: కొత్త ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో లాభాలు. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకర వాతావరణం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. ఇంటి మరమ్మతులకు డబ్బు ఖర్చు పెడతారు. కొంతమంది ఇంటి మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృషభ రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆఫీసుకు లేటుగా రావడంను పై అధికారులు గమనిస్తున్నారు జాగ్రత్త. తీసుకున్న రుణాలను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి

మిథున రాశి: దైవ ప్రార్ధన వల్ల మానసిక బలం. విద్యార్థులు మీకు అర్థం కాని సబ్జెక్టు లను అడిగి తెలుసుకోండి. లేకపోతే పరీక్షలలో ఇబ్బంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులకు మంచి తరుణం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.

కర్కాటక రాశి: మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను మీ శక్తిసామర్థ్యాలను ఉపయోగించి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ లేక ప్రమోషన్. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు లాభకరం.

సింహరాశి: మంచికి చెడుకు ఒకే రకంగా ప్రవర్తించే మీ స్థితప్రజ్ఞతపై అందరి ప్రశంసలు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆదాయ వ్యవహారాలపై కుటుంబ సభ్యులతో చర్చించండి. బంగారు భవిష్యత్తు కై అనవసరపు ఖర్చులను నివారించండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి అధిక శ్రమ పడవలసి వస్తుంది.

కన్య రాశి: పట్టుదల ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నూతన అవకాశాలు లభిస్తాయి. ఒత్తిడిని అధిగమించడానికి ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు. వ్యాపార విస్తరణ కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇతరులతో వాదోపవాదాలకు దిగటం వలన సమయం వృధా. ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాల వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు.

తులారాశి: ఆఫీసు పనుల్లో అధిక శ్రమ ఉన్నప్పటికీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ వ్యక్తిత్వం పై అందరి ప్రశంసలు. ఆఫీసులో అదనపు బాధ్యతలు వల్ల అధిక శ్రమ. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి.

వృశ్చిక రాశి: అతిగా ఊహించుకోకండి అందిన దానితో తృప్తి పడండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. మీ కన్నా చిన్న వారికి ఉచిత సలహాలు ఇద్దామనే మీ ప్రయత్నాలు వ్యర్థం. ఇతరుల మీద అసూయ పడటం అంత మంచిది కాదు. కొంతమందికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ అవకాశం.

ధనస్సు రాశి: ఆశావహ దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. సహనంతో ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పై అధికారుల ప్రశంసలు.రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలుమీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి వారి భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకోండి.

మకర రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక అవసరం. తప్పుడు సలహాలు ఇచ్చే వారిని దూరం పెట్టండి. ముఖ్యమైన నిర్ణయాలను స్వంతంగా ధైర్యంగా తీసుకోండి. ఆఫీసు పనులపై శ్రద్ధ పెట్టండి. సరైన ప్రణాళికతో ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి తరుణం. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చులను నివారించండి.

కుంభరాశి: ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు దాని వల్ల మానసిక ప్రశాంతత వ్యాపారులకు లాభాలు దానివలన ఆర్ధిక సమస్యలు దూరం. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. సరైన భోజనం వల్ల పూర్తి ఆరోగ్యం. కుటుంబ సమస్యల వల్ల మానసిక అశాంతి. మీ భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేయండి. ఆఫీసులో మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు.

మీన రాశి: ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు దాని వల్ల మానసిక ప్రశాంతత. మీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు తీర్పు మీకు అనుకూలం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చులు వల్ల డబ్బుకి ఇబ్బంది. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి.

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల