Zodiac Signs: జాతక రీత్యా ఈ రాశుల వారి వ్యవహారశైలి చాలా కఠినంగా ఉంటుంది.. ఒక్కోసారి భరించలేనిదిగా కూడా ఉంటుంది.. ఏ రాశుల వారో తెలుసుకోండి!
సాధారణంగా మన వ్యక్తిత్వం.. ప్రవర్తనా మన పెంపకం పై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. మనం పెరిగిన వాతావరణం.. మన విద్య కూడా మన వ్యక్తిత్వంపైనా..ప్రవర్తనపైనా ప్రభావం చూపిస్తాయి.
Zodiac Signs: సాధారణంగా మన వ్యక్తిత్వం.. ప్రవర్తనా మన పెంపకం పై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. మనం పెరిగిన వాతావరణం.. మన విద్య కూడా మన వ్యక్తిత్వంపైనా..ప్రవర్తనపైనా ప్రభావం చూపిస్తాయి. ఒక్కోసారి మన తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా మనల్ని పెంచినా మన చుట్టుపక్కల ఉండే వాతావరణం కారణంగా చెడు అలవాట్లు వస్తాయి. ఇక పెద్ద కుటుంబంలో పుట్టిన వారు కూడా కఠినంగా.. పధ్ధతి లేకుండా తయారవడం మనం తరచూ చూస్తుంటాం. ఇప్పటివరకూ మనం చెప్పుకున్న అన్ని విషయాలకు మన రాశులతో సంబంధం ఉందంటుంది జ్యోతిష శాస్త్రం.
మీ రాశిచక్రం మీ వ్యక్తిత్వ లక్షణాలను బాగా ప్రతిబింబిస్తుంది. మీ రాశిచక్రంలో ప్రతిదీ నిగూఢమై ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇది మీ జీవిత రూపురేఖలను నిర్ణయిస్తుంది. కానీ మొత్తం పన్నెండు రాశులలో, కొన్ని రాశులకు చెందిన వారు మాత్రం చాలా విపరీతమైన లక్షణాలను ప్రదర్శిస్తారు. వారు ఎవరి మాట వినకుండా తమ మాటలకు కట్టుబడిఉంటారు. తమకు తోచిందే చేస్తారు. దానిలోని మంచి చెడ్డల గురించి వారు ఆలోచించారు. దీని కారణంగా అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. జ్యోతిష శాస్త్రం చెబుతున్న ఆరాశుల గురించి తెలుసుకుందాం.
ధనుస్సు
ధనుస్సు రాశి వారు సరదాగా ఉంటారు. కానీ వారి ప్రవర్తనలో మొరటుతనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎదుటివ్యక్తితో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఎదుటివారు ఎంత చెప్పినా వినకపోగా వారి తప్పులేకపోయినా వారితో కఠినంగా మాట్లాడతారు. అది తప్పు అని తెలిసినా కూడా వీరు అస్సలు క్షమాపణ చెప్పరు.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వ్యక్తులు ఇతరుల భావాలను పట్టించుకోరు. పరిస్థితితో సంబంధం లేకుండా మొరటుగా ప్రవర్తించడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు. వారు ఏదైనా చెప్పాలి అనుకుంటే.. ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా తన మాట మీదే నిలబడతారు. అది తప్పైనా సరే ఒప్పుకోరు. నిలబెట్టుకుంటాడు.
మిథునం
మిధునరాశి వ్యక్తులు అత్యంత అపరిపక్వ రాశిగా చెబుతారు. అందుకే కొన్నిసార్లు వారు తమ భావోద్వేగాలను నియంత్రించలేరు. వారు తమ భావోద్వేగాలను ఆపుకోలేరు. దీంతో ఎదుటివారిపై ఒక్కోసారి అమానుషంగా మాట్లాడేస్తారు. ఎలా తోస్తే అలా తమ మాటలను విసిరేస్తారు.
మేషం
మేష రాశి వారు ఏ పరిస్థితిలోనూ తమను తాము నియంత్రించుకోలేరు. తమకు నచ్చని విషయం ఎదురైనపుడు వారి ప్రవర్తన చాలా అసంబద్ధంగా ఉంటుంది. వారికీ వ్యతిరేకంగా ఏవైనా పరిస్థితులు ఎదురైతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఆలా వదిలేయకుండా అసభ్యంగా ఎదురుతిరుగుతారు.
వృషభం
వృషభరాశి ప్రజలు చాలా సంయమనంతో ఉంటారు. కాబట్టి వారు ఏదైనా లేదా ఎవరైనా రెచ్చగొడితే, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే అవకాశం ఉండదు. కాబట్టి, మీకు వృషభరాశి స్నేహితుడు ఉంటే, అతడిని ఇబ్బంది పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
గమనిక- ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు , జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది.