Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉంది.. ఏ రాశివారు విద్య ఉద్యోగాల్లో రాణిస్తారంటే..

Horoscope Today(August 24th 2021): ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే..

Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉంది.. ఏ రాశివారు విద్య ఉద్యోగాల్లో రాణిస్తారంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2021 | 7:49 AM

Horoscope Today(August 24th 2021): ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆగస్ట్ 24వ తేదీ మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశి నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు శుభవార్త అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి: ఈ రాశివారికి మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

మిధున రాశి:ఈరాశి వారికి ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు అనుకూలించవు. వ్యాపారస్తులకు అనుకూలం కాదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

కర్కాటక రాశి:ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహ రాశి:ఈరోజు కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. సన్నిహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధిక అవసరాలు తీరతాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కన్య రాశి:ఈ రాశివారికి పనులకు అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.

తులా రాశి:ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కుటుంబంతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి.

వృశ్చిక రాశి:ఈరోజు నిరుద్యోగులకు నిరాశకలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం ఉంటుంది. ఆస్థి వ్యవరాల్లో వివాదాలు ఏర్పడతాయి.

ధనుస్సు రాశి:ఈరోజు ఈ రాశివారికి వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. ప్రముఖ నుంచి విశేష ఆదరణ సొంతం చేసుకుంటారు. ఉద్యోగ విషయాల్లో మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మకర రాశి:ఈ రాశి వారికి కుటుంబ పరంగా చికాకులు ఎదురవుతాయి. ఆకస్మిక ధన వ్యయం అవుతుంది. వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

కుంభ రాశి:ఈరాశి వారు చేపట్టినటువంటి పనులు విశేషంగా పూర్తి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉంటారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది.

మీన రాశి:ఈ రాశివారికి ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా జరుగుతాయి. చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పెద్దల సహకారంతో పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు.

Also Read: Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే