Antarvedi-Uppada: సముద్ర గర్భంలో అలజడి.. అంతర్వేదిలో ఎగిసిపడుతున్న రాకాసి అల.. ఉప్పాడలో ఎడారిలా మారిన తీరం!

సముద్రం ఏదో సంకేతమిస్తోంది. విరుచుకుపడతాను.. జాగ్రత్త అంటోందా? ప్రళయకాలాన్ని ముందే సూచిస్తోందా? సముద్ర గర్భంలో ఏంటా అలజడి. అంతుచిక్కని మిస్టరీ..

Antarvedi-Uppada: సముద్ర గర్భంలో అలజడి.. అంతర్వేదిలో ఎగిసిపడుతున్న రాకాసి అల.. ఉప్పాడలో ఎడారిలా మారిన తీరం!
Antarvedi Uppada
Follow us

|

Updated on: Aug 25, 2021 | 9:13 PM

Antarvedi-Uppada Tsunami fear: సముద్రం ఏదో సంకేతమిస్తోంది. విరుచుకుపడతాను.. జాగ్రత్త అంటోందా? ప్రళయకాలాన్ని ముందే సూచిస్తోందా? సముద్ర గర్భంలో ఏంటా అలజడి. అంతుచిక్కని ఈ మిస్టరీ ఇప్పుడు శాస్త్రవేత్తలనూ కలవరపెడుతోంది. సముద్ర తీర ప్రాంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు రెండు చిత్ర విచిత్ర పరిణామాలు. ఒకటి అంతర్వేది దగ్గర సముద్రం ముందుకు చొచ్చుకురావడం. అది కూడా 45 మీటర్ల మేర ముందుకొచ్చింది సముద్రం. సరే, అడపాదడపా సహజం అనుకుందాం. కానీ.. ఇదే బంగాళాఖాతం.. మరోచోట అంతే దూరం వెనక్కి వెళ్లిపోయింది.. అదే ఉప్పాడ. ఈ రెండింటికీ మధ్య దూరం.. జస్ట్ 128 కిలోమీటర్లు.. ! ఎలా సాధ్యం ఈ వింత !

ఈ రెండింటికీ లింకైన మరో ఘటన చోటుచేసుకుంది. ఏపీకి ఆనుకుని ఉన్న అదే సముద్ర గర్భంలో ప్రకంపనాలు వచ్చాయి. నరసాపురానికి 260కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ప్రకంపన కేంద్రాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ ప్రకంపనాలవల్లనే సముద్రం ముందుకొచ్చిందా.. ఉప్పాడలోనూ సముద్రం వెనక్కి వెళ్లడానికి కారణం అదేనా.. నిజానికి NGRI శాస్త్రవేత్తలూ దీనిపై లోతైన పరిశోధన చేస్తున్నారు. అయితే భూమిపై వస్తే అది భూకంపం. కానీ అదే ప్రకంపన సాగరగర్భంలో వస్తే.. అదే సునామీ. దాని తీవ్రతను బట్టి.. తీరంలో, భూమిపై ఎఫెక్ట్ ఉంటుంది.

అంతర్వేదిలో సముద్రం ఇలా ముందుకొచ్చి అలా వెళ్లిపోలేదు. తీరంలో ఉన్న గెస్ట్‌హౌస్‌లు, షాప్‌లను ధ్వంసం చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అంతర్వేదిలో క్షణానికో రాకాసి అల ఎగసిపడుతోంది. ఎవరైనా సాగరంలో కాళ్లు పెడితే లోపలికి ఈడ్చుకెళ్లిపోతాయేమో అనిపించే స్థాయిలో అలలు కలవర పెడుతున్నాయి. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి వేళల్లో ఆటుపోట్లు పెరుగుతుంటాయి. అది ఖగోళ, భౌగోళిక సంబంధం. కానీ.. అనూహ్యంగా ఏంటీ సాగర మథనం.. ! సముద్రంలో భూప్రకంపనలే ఇలాంటి అలజడికి కారణమా? ఒక్కసారి సముద్ర గర్భంలో భూమి కంపించడం మొదలుపెడితే.. అది అలాగే చాలా రోజుల వరకూ కంటిన్యూ అవుతుందన్న భయాలుంటాయి. ఒకవేళ ఇదే తరహాలో భూమి కంపించుకుంటూపోతే.. ఆ తీవ్రత ఇంకాస్త పెరిగితే.. అది సునామీకి కూడా దారి తీసే అవకాశం ఉందా?

అంతర్వేదిలో సముద్రం ముందుకు.. ఉప్పాడలో వెనక్కి.. ఈ రెండూ జరగడానికి ముందు అనూహ్యంగా సముద్రంలో ప్రకంపనాలుగా చెప్పే సునామీ రావడం. సముద్రాలు ఇస్తున్న ఈ సంకేతాలపై ఇటీవలే ఓ అధ్యయనం రిపోర్ట్‌ కూడా బయటికొచ్చింది. దాని ప్రకారం చూస్తే ఇండియాలో తీర ప్రాంతంలో ఉన్న చాలా సిటీస్‌ నీట మునిగిపోవడం ఖాయం అన్నది దాని సారాంశం.

వాతావరణ మార్పులపై ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానల్‌ IPCC ఓ భయంకరమైన రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం.. దేశంలోని 12 సిటీస్ భవిష్యత్‌లో కనిపించకుండా పోతాయట. అందులో ఏపీ నుంచి విశాఖ కూడా ఉంది. గతేడాది అధ్యయనాల్లో కాకినాడ కూడా కొన్నేళ్లలో కనుమరుగు అవ్వడం ఖాయంగా తెలిసింది. తాజా రిపోర్ట్‌ల ప్రకారం… ఏపీలోని విశాఖతో పాటు ముంబై, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్‌నగర్‌, మంగళూరు, మార్మగోవా, పారాదీప్‌, ఖిధిర్‌పూర్‌, ట్యూటుకోరిన్.. ఈ 12 సిటీస్‌.. సాగరంలో మునిగిపోవడం ఖాయం.

IPCC ఇచ్చిన రిపోర్ట్‌ ఎప్పుడో ఈ శతాబ్దం చివరి నాటికి జరిగే ఉపద్రవం మీద. ప్రస్తుతం అంతర్వేది, ఉప్పాడలో సముద్ర అలజడి, సాగర గర్భంలో సునామీ ఇవన్నీ చూస్తుంటే.. పరిస్థితి శతాబ్దం చివరిదాకా అయినా ఆగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Read Also…  Viral Video: మీరేనా నేనూ ధరిస్తా మాస్క్.. ఈ వానరం ఏశాలు మామూలుగా లేవండోయ్.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!