AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Murder: రాహుల్ హత్య కేసు.. మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెల్లడించిన కోగంటి సత్యం..

వ్యాపారి రాహుల్‌ హత్య కేసు కొలిక్కివస్తోంది. కంపెనీల షేర్ల వివాదమే.. రాహుల్‌ హత్య కారణమన్నారు పోలీసులు. హత్య తర్వాత కోరాడ విజయ్‌కు బంధువుల ఆశ్రయం ఇచ్చారు.

Rahul Murder: రాహుల్ హత్య కేసు.. మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెల్లడించిన కోగంటి సత్యం..
Rahul Muder Case Koganti Satyam
Balaraju Goud
|

Updated on: Aug 25, 2021 | 8:48 PM

Share

Rahul Murder Remand Report: వ్యాపారి రాహుల్‌ హత్య కేసు కొలిక్కివస్తోంది. కంపెనీల షేర్ల వివాదమే.. రాహుల్‌ హత్య కారణమన్నారు పోలీసులు. హత్య తర్వాత కోరాడ విజయ్‌కు బంధువుల ఆశ్రయం ఇచ్చారు. రాహుల్‌ ఫోన్లు కొరడా విజయ్‌ దగ్గర పోలీసులు గుర్తించారు. కోరాడ విజయ్‌కుమార్‌తో పాటు కారుడ్రైవర్‌ పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

రాహుల్ మర్డర్ కేసులో మొదట్నుంచీ కోగంటి సత్యం పేరు ప్రధానంగా వినిపించింది. రాహుల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులోనూ కోగంటి పేరును చేర్చారు విజయవాడ పోలీులు. రాహుల్ మర్డర్ కు ప్లాన్ వేసింది. దాన్ని అమలు చేసింది కోగంటేనన్న మాట బెజవాడ మొత్తం రీసౌండ్ వచ్చింది. అసలు, రాహుల్ కంపెనీలోనే లేని కోగంటి ఎందుకు ఇన్వాల్స్ అయ్యాడనే కోణం దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు మైండ్ బ్లాకయ్యే నిజాలు తెలిశాయ్. అసలు కుట్రదారుడే కోగంటిగా గుర్తించి అతని కోసం వేట మొదలుపెట్టారు. అయితే, అప్పటివరకు బెజవాడలోనే ఉన్న కోగంటి… ఎప్పుడైతే పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్నాడో పారిపోయేందుకు ప్రయత్నించాడు.

ఈనెల 19న రాహుల్ మర్డర్ జరిగితే, 22వరకు బెజవాడలోనే ఉన్నాడు. అంటే నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉంటూ తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఎప్పుడైతే పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్నాడో ఈనెల 23న బెంగళూరు పారిపోయాడు. అక్కడ్నుంచి విదేశాలకు చెక్కేయాలని ప్లాన్ వేసుకున్నాడు. కానీ, బెజవాడ పోలీసులు… కోగంటి కంటే వేగంగా స్కెచ్ వేశారు. ఈమెయిల్ ద్వారా బెంగళూరు ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొరికిపోయాడు. బెంగళూరు ఎయిర్ పోర్టులో అక్కడి పోలీసులు కోగంటిని అరెస్ట్ చేశారు. అక్కడ్నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై కోగంటిని విజయవాడ తరలించిన ఏపీ పోలీసులు…. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించారు.

కోగంటి సత్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. కోగంటి రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతిలో ఉంది. కోగంటి రిమాండ్ రిపోర్ట్ ను క్లూజివ్ గా టీవీ9 సంపాదించింది. రిమాండ్ రిపోర్ట్ లో కోగంటి పాత్రను క్లియర్ గా ప్రస్తావించారు పోలీసులు. రాహుల్ మర్డర్ కేసులో కోగంటిని ఏ4గా చేర్చిన పోలీసులు.. ప్రధాన నిందితుడు ఏ1 కోరాడ విజయ్ తో కలిసి రాహుల్ మర్డర్ కు కుట్ర పన్నినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే కోగంటి సత్యంపై మొత్తం 24 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Read Also…. Fire Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా పేలి మహిళ సజీవ దహనం, మరొకరి పరిస్థితి విషమం