AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా పేలి మహిళ సజీవ దహనం, మరొకరి పరిస్థితి విషమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. బూర్గంపాడు మండలం సారపాకలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా ఒక్కసారిగా పేలింది. మహిళ సజీవదహనంకాగా..ఆమె కుమారుడు పరిస్థితి విషమం..

Fire Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా పేలి మహిళ సజీవ దహనం, మరొకరి పరిస్థితి విషమం
Fire Accident
Balaraju Goud
|

Updated on: Aug 25, 2021 | 8:29 PM

Share

Huge Explosion at Crackers Shop: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బూర్గంపాడు మండలం సారపాకలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా ఒక్కసారిగా పేలింది. భవాని అనే మహిళ సజీవదహనంకాగా..ఆమె కుమారుడు దుర్గ ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి మంటలు భారీగా ఎగసిపడ్డాయి.

సారపాక ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఓ ఇంటిని రాజమండ్రికి చెందిన భీమ్ శంకర్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి బాణసంచా తీసుకువచ్చి అమ్మకాలు చేస్తుంటాడు. అయితే, ఈ సాయంత్రం అతని గది నుంచి ఒక్కసారిగా పేలుళ్లు వినిపించాయి. బాణసంచా మొత్తం అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడు శబ్దాలకు చుట్టుపక్కల జనం వణికిపోయారు. పేలుడు జరిగిన గది పక్కనే ఓ ఆపార్ట్ మెంట్ ఉంది. అందులోని జనమంతా భయంతో పరుగులు తీశారు..

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అతికష్టంమ్మీద మంటల్ని అదుపులోకి తెచ్చారు. రాబోయే వినాయక చవితికి విక్రయించేందుకే ఇంట్లో భారీ ఎత్తున బాణసంచాను నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వచేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు అధికారులు. కాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also…  Pocharam Srinivas Reddy: సిక్స్‌ కొట్టిన అసెంబ్లీ స్పీకర్‌.. చిచ్చర పిడుగులతో బ్యాటింగ్‌.. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన పోచారం..

Viral Video: కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి మండపం ఎక్కనంటూ నవ వధువు ఏడుపు.. అసలు కారణం తెలిసి నవ్వుకున్న జనాలు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!