Viral Video: కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి మండపం ఎక్కనంటూ నవ వధువు ఏడుపు.. అసలు కారణం తెలిసి నవ్వుకున్న జనాలు..

Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకలు, వధూవరుల వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటే..

Viral Video: కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి మండపం ఎక్కనంటూ నవ వధువు ఏడుపు.. అసలు కారణం తెలిసి నవ్వుకున్న జనాలు..
Bride Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 25, 2021 | 7:51 PM

Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకలు, వధూవరుల వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ పెళ్లి కూతురు.. బుల్లెట్టు పాటకు చేసిన డ్యాన్స్‌.. తెలుగు రాష్ట్రాలనే కాదు.. ఏకంగా సోషల్‌ మీడియానే షేక్ చేసింది. అలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు మరో పెళ్లి కూతురు తను అనుకున్నది జరగలేదని, ఏకంగా పెళ్లి పీటలపైకి రానని మొండికేసింది. ఎంతమంది చెప్పినా వింటే ఒట్టు. అవునండీ మీరు విన్నది నిజమే.. పెళ్లి మండపానికి వచ్చిన నవ వధువు.. మండపం ఎక్కడానికి నో చెప్పింది. దీంతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. అయితే, అసలు విషయం తెలుసుకున్న పెళ్లి వారంతా ఘొల్లున నవ్వుకున్నారు.

కాసేపట్లో పెళ్లి జరుగనుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది క్షణాల్లో పెళ్లి కూతురు వచ్చే వేళయింది. అంతా హడావుడిగా ఉన్నారు. ఇంతలో పెళ్లి కూతురు రానే వచ్చింది. వచ్చీ రాగానే ఏడుపు లంకించుకుంది. నేను పెళ్లి వేదికపైకి రాను అంటూ మొండి చేసింది. ఇలా చాలాసేపు హంగామా చేసింది. పెళ్లి కూతురు ఫ్రెండ్స్, బంధువులు, అన్నా తమ్ములు.. అంతా.. ఆమె ఏడుపు చూసి షాక్ అయ్యారు. అదేంటి.. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఏడుస్తోందంటూ కంగారు పడ్డారు. అసలు కారణం ఏంటా అని ఆరా తీస్తే.. అసలు విషయం తేరగా చెప్పింది.

పెళ్లికి ముందుగానే ఆమె.. తాను ఎంటర్ అయ్యేటప్పుడు స్పెషల్ సాంగ్ ప్లే చేయమని చెప్పిందట, కానీ ఆమె వచ్చేటప్పుడు ఆ సాంగ్ కాకుండా వేరే సాంగ్ ప్లే చేశారని ఈ హంగామా అంతా చేసిందట. ఇది విన్న అక్కడి వారు నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. చివరికి ఆమెకు నచ్చిన పాటను ప్లే చేయడంతో కథ సుఖాంతం అయ్యింది. వధువు పెళ్లి పీటలెక్కింది. అందరూ అబ్బుపడేలా వివాహం జరిగింది. కాగా, బుల్లెట్టు సాంగ్‌ కంటే స్పీడ్‌గా ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో నెట్టింట దూసుకుపోతోంది.

Viral Video:

Also read:

ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు? ..సవాళ్ళను ఎదుర్కొంటామన్న జనరల్ బిపిన్ రావత్

అమరీందర్ సింగ్ పై తిరుగుబావుటా.. నాయకత్వ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్..

Mallareddy: ఇద్దరు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. తొడగొట్టి రేవంత్‌కు సవాల్ విసిరిన మల్లారెడ్డి..