అమరీందర్ సింగ్ పై తిరుగుబావుటా.. నాయకత్వ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్..
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నాయకత్వాన్ని మార్చాలంటూ తిరుగుబాటు చేసిన రెబెల్ మంత్రులు, ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే పార్టీ పోటీ చేస్తుందని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి,
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నాయకత్వాన్ని మార్చాలంటూ తిరుగుబాటు చేసిన రెబెల్ మంత్రులు, ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే పార్టీ పోటీ చేస్తుందని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ హరీష్ రావత్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో సింగ్ పార్టీని లీడ్ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. అమరీందర్ సింగ్ నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండును అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. అంతకుముందు నలుగురు కేబినెట్ మంత్రులు..త్రిప్ట్ రాజేందర్ సింగ్ బాజ్వా, సుఖ్ బిందర్ సింగ్ సర్కారియా, సుఖ్ జిందర్ సింగ్ రంధావా, చరణ్ జిత్ సింగ్ ఛాన్ని…డెహ్రాడూన్ లో హరీష్ రావత్ ని కలిశారు. వీరితో బాటు సుమారు 23 మంది ఎమ్మెల్యేలు కూడా అమరీందర్ సింగ్ నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరలేదని, ఈయన లీడర్ షిప్ కింద పార్టీకి మనుగడ ఉండదని వీరు అంటున్నారు. ఆయన పట్ల తమకు నమ్మకం పోయిందన్నారు.2015 లో ఓ మత గ్రంథం (బహుశా గురు గ్రంథ్ సాహిబ్) నాశనం కాగా అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగిందని,పైగా డ్రగ్ కేసులతో ప్రమేయమున్న ‘పెద్ద చేపలపై’ కూడా ఎలాంటి చర్యలను ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అమరీందర్ సింగ్ ప్రభుత్వం రద్దు చేసిందని..ఇలా పలు ఆరోపణలను వీరు గుప్పించారు. ఇలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దు, సీఎం అమరీందర్ సింగ్ మధ్య మళ్ళీ విభేదాలు మొదలయ్యాయి. సిద్దు సలహాదారుల్లో ఇద్దరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపట్ల అమరీందర్..తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం గమనార్హం. వారిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ఇద్దరినీ సిద్దు పిలిపించి వివరణ కోరినప్పటికీ.. తమ వ్యాఖ్యలకు తాము కట్టుబడే ఉంటామని వారు స్పష్టం చేశారు. ఇది సిదుకు ఇరకాట పరిస్థితినే కల్పించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రైవేటీకరణతోనే ఇండియా ముందుకెళ్తుందా.? Big News Big Debate Live Video.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల…: TS EAMCET Result 2021 Live Video.
కన్నింగ్ లేడీ.. హనీట్రాప్ కేసులో కీలకం.. ముగ్గురి పేర్లతో ఒకే యువతి మోసం..:Honeytrap Case Video.