Big News Big Debate: ప్రైవేటీకరణ పేరుతో అన్ని రంగాల్లోకి ప్రభుత్వేతర సంస్థలు..!

కొత్తగా మానిటైజేషన్‌ తెరమీదకు తెచ్చి రోడ్లు, రైళ్లు, విద్యుదుత్పత్తి, గ్యాస్‌, మైనింగ్‌, ఎయిర్‌పోర్ట్స్‌, నౌకాశ్రయాలు, స్టేడియాలు అన్నీ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి సిద్దమైంది.

Big News Big Debate: ప్రైవేటీకరణ పేరుతో అన్ని రంగాల్లోకి ప్రభుత్వేతర సంస్థలు..!
Big News Big Debate Live Video
Follow us
Balaraju Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 26, 2021 | 7:30 AM

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

Big News Big Debate: విశాఖ స్టీల్‌ సహా పలు ప్రభుత్వరంగ సంస్థల అమ్మకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. కొత్తగా మానిటైజేషన్‌ తెరమీదకు తెచ్చి రోడ్లు, రైళ్లు, విద్యుదుత్పత్తి, గ్యాస్‌, మైనింగ్‌, ఎయిర్‌పోర్ట్స్‌, నౌకాశ్రయాలు, స్టేడియాలు అన్నీ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి సిద్దమైంది. నీతి ఆయోగ్ సలహాతో మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా ఆవిష్కరించారు. ప్రజా ఆస్తులు, దేశసంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే పథకమని విపక్షాలు ఆరోపిస్తుంటే.. నిరర్థక ఆస్తుల నుంచి ఆదాయం సృష్టించే మార్గమని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రైవేటీకరణ పేరుతో అన్ని రంగాల్లోకి ప్రభుత్వేతర సంస్థలు.. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ డిజిన్విస్టిమెంట్‌ పేరుతో వాటాలు ప్రైవేటు చేతికి.. అమ్మడానికి సాధ్యంకాని ప్రభుత్వ ఆస్తులను కూడా ఏదోరూపంలో ప్రైవేటుకి ఇవ్వడానికి వచ్చిన స్కీమే కొత్తగా నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్ అంటున్నాయి విపక్షాలు..

ఇండియా ఫర్‌ లీజ్‌?

1. అసలు ఏంటీ.. నేషనల్‌ మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌ – (NMP)

నీతీఆయోగ్‌ రికమండేషన్స్‌ 2021-22 బడ్జెట్‌లో ప్రస్తావన టార్గెట్‌ రూ.6లక్షల కోట్లు వ్యవధి 2022-25 ప్రభుత్వం, CPSE సంస్థలు

2. ఏ సెక్టార్‌ నుంచి ఎంత? (Chart Department wise)

3. మానిటైజేషన్ టార్గెట్‌ ఫిక్స్‌ Year Wise Target Chart 2022 – రూ.88190 కోట్లు 2023- రూ.162422 కోట్లు 2024- రూ.179544 కోట్లు 2025- రూ.167345 కోట్లు

4. NMP సేల్‌ కాదా? 1. ఓనర్‌ షిప్‌ కాదు రైట్స్‌ 2. అసెట్‌ రిస్క్‌ తగ్గించడం, ఆదాయం పెంపు 3. ఫ్రేమ్‌ వర్కు ప్రకారమే ఒప్పందాలు

5. లాభాల్లోనే CPSEలు మొత్తం సంస్థలు 256 కంపెనీల టర్నొవర్‌ 24.61 లక్షల కోట్లు నెట్‌ ప్రాఫిట్‌ 1.38లక్షల కోట్లు లాభాల్లో 171 కంపెనీలు సోర్స్‌: పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం ప్రకారం

 ప్రతిపక్షాలు బీజేపీ 
దేశసంపదను దోచిపెట్టేందుకు ప్రైవేటైజేషన్‌, మానిటైజేషన్ వృధాగా ఉంచడం కంటే ఆదాయం తీసుకొచ్చే మార్గాలే ఇవి
70 ఏళ్లుగా డెవలప్‌ అయిన ప్రజాధనాన్ని అమ్మేస్తోంది వీటిని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే లక్ష్యం
కీలక రంగాల్లో ఆస్తులను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం నిరర్ధక ఆస్తులను ప్రైవేటుకు ఇచ్చి ఉపయోగంలోకి తేవడంలో తప్పేముంది
అధికారికంగా భారతదేశ విక్రయాన్ని ప్రకటించింది వ్యాపారం ప్రభుత్వ పని కాదు, వ్యాపార అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత
కీలకరంగాల్లో గుత్తాధిపత్యం పెరిగి, ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి పెట్టుబడులు వచ్చి ఉపాథి అవకాశాలు ఇంకా పెరుగుతాయి
ఈ నగదీకరణతో క్రోనీ కార్పొరేట్‌లకు మాత్రమే ప్రయోజనాలు రాష్ట్రాలకు రాయితీలు, గ్రాంట్లు పెరుగుతాయి
ప్రజాస్వామ్య భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీగా మార్చుతున్నారు ప్రజల సంక్షేమానికి ఆదాయ మార్గాల అన్వేషణలో భాగం

2022 నుంచి 2025 వరకూ నాలుగేళ్లలో 6 లక్షల కోట్లను సమీకరించేందుకు భారీ ప్రణాళికలు ప్రకటించింది కేంద్రం. నీతీ ఆయోగ్‌ రూపొందించిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ద్వారా ప్రైవేట్‌ రంగ పెట్టుబడులను తీసుకొస్తామంటోంది. జాతీయ రహదారులు, ట్రాన్స్‌పోర్ట్‌, రైల్వే, విద్యుత్తు, నాచురల్‌ గ్యాస్‌, ఏవియేషన్‌, పోర్టులు టెలీకమ్యూనికేషన్లు, ఫుడ్‌, మైనింగ్‌, అర్బన్‌ రియాల్టీ ఇలా అన్ని రంగాల్లో ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి రంగం సిద్దం చేశారు. 20కిపైగా రంగాల్లో ప్రభుత్వ ఆస్తులను క్యాష్‌ చేస్తామంటోంది ప్రభుత్వం.

70 ఏళ్లుగా దేశ ప్రజలు కూడగట్టిన ప్రజాఆస్తులను విక్రయించడమే అంటున్నాయి విపక్షాలు. పాలకుల దివాళకోరుతనమని.. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరణ అడ్డుకుంటామంటున్నాయి పార్టీలు. ఇండియా ఫర్‌ సేల్‌ అన్నట్టుగా BJP విధానం మారిందన్నారు రాహుల్‌ గాంధీ. లెఫ్ట్‌ సహా రీజనల్‌ పార్టీలు కూడా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ప్రభుత్వం నిరర్థకంగా ఉన్న ఆస్తుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చాలన్న సమున్నత లక్ష్యంతో మాత్రమే మానిటైజేషన్ విధానం తీసుకొచ్చామంటోంది ప్రభుత్వం. ఆయా ఆస్తులపై యాజమాన్య హక్కులు కూడా ప్రభుత్వానివేనని, నిర్ణీతకాలం తర్వాత ప్రైవేటు భాగస్వామి ఆస్తి హక్కును ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం తప్పనిసరి అంటోంది ప్రభుత్వం. ఏది ఏమైనా గ్లోబలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌ దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇప్పుడు మానిటైజేషన్ ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుంది.. కేంద్రం పెంచుకోవాలనుకుంటున్న ఆదాయ మార్గాలేంటి? నిపుణులు వాదనలేంటి? ఇవే అంశాలపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌డిబేట్‌లో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.. ఫుల్‌ వీడియో కోసం వాచ్‌…

Read Also…Antarvedi-Uppada: సముద్ర గర్భంలో అలజడి.. అంతర్వేదిలో ఎగిసిపడుతున్న రాకాసి అల.. ఉప్పాడలో ఎడారిలా మారిన తీరం!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే