Narayan Rane: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కేంద్రమంత్రి నారాయణ రాణే‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..ఇంతకీ ఏం జరిగిందంటే..?

మహారాష్ట్రలో శివసేన-బీజేపీల మధ్య వివాదం మరింత రాజుకుంది. ఏకంగా కేంద్ర మంత్రినే పోలీసులు అరెస్ట్ చేసే దాక వెళ్లింది.

Narayan Rane: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కేంద్రమంత్రి నారాయణ రాణే‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..ఇంతకీ ఏం జరిగిందంటే..?
Narayan Rane
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 25, 2021 | 6:37 PM

Narayan Rane Arrest: మహారాష్ట్రలో శివసేన-బీజేపీల మధ్య వివాదం మరింత రాజుకుంది. ఏకంగా కేంద్ర మంత్రినే పోలీసులు అరెస్ట్ చేసే దాక వెళ్లింది. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్ట్ చేశారు. పదవిలో ఉన్న కేంద్ర మంత్రిని అరెస్ట్‌ చేయటం 20 ఏళ్లలో ఇది తొలిసారి. నారాయణ రాణే అరెస్ట్‌తో పదవిలోఉన్న కేంద్ర మంత్రులు అరెస్టైన వారి సంఖ్య మూడుకు చేరింది.

పదవిలో ఉండగా అరెస్టైన కేంద్ర మంత్రుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే… జూన్‌, 2001లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన అప్పటి కేంద్ర మంత్రులు మురసోలి మారన్‌, టీఆర్‌ బాలును.. ప్లైఓవర్‌ స్కాం కేసులో చెన్నై పోలీసులు(నాటి జయలలిత పాలనలో) అరెస్ట్ చేశారు. అక్టోబర్‌ 21, 2019లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కాం కేసులో కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర మాజీ హోం మంత్రి అరెస్ట్ అప్పట్లో సంచలనంగా మారింది.  కాగా, 105 రోజుల జైలు జీవితం తర్వాత డిసెంబరు 2019లో విడుదలయ్యారు చిదంబరం. ఇక, 2017లో పశుగ్రాసం కేసులో కేంద్ర మాజీ మంత్రి, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా, 1998లో టెలికాం కేసులో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రాం కూడా అరెస్ట్ అయ్యారు.

నారాయణ రాణే అరెస్ట్ వెనుక…

మహారాష్ట్ర జన అశీర్వాద యాత్ర నిర్వహిస్తున్న కేంద్రమంత్రి నారాయణ రాణేను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్‌ను అడ్డకునేందుకు ముంబైలో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ప్రయత్నించారు. శివసేన ప్రభుత్వం ప్రతీకారచర్యకు పాల్పడుతోందంటూ బీజేపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఇదిలావుంటే ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని నారాయణ రాణే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై శివసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీంతో రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో పదవిలో ఉండగా ఓ కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్ట్ చేయడం గడచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరి నిమిషం వరకు అరెస్ట్‌ను ఆపడానికి ప్రయత్నించిన మంత్రి.. బాంబే హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.

నారాయణ రాణేకు బెయిల్ మంజూరు

రాణేపై నమోదైన కేసులు కొట్టేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది.  తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరిన ఆయన, అంతేకాకుండా “రాజకీయ ప్రేరేపిత” ఆరోపణలపై సరైన నోటీసు లేకుండానే అరెస్టు చేశారని నారాయణ రాణే తరఫున అడ్వకేట్స్ వాదించారు. ఇరు వాదనలు విన్న తర్వాత రాణేకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ పొందిన తర్వాత నారాయణ రాణే ” సత్యమేవ్ జయతే ” అంటూ ట్వీట్ చేశారు.

అయితే, కేంద్ర మంత్రి తరపు న్యాయవాది ఆగస్టు 31, సెప్టెంబర్ 13న పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. పోలీసు విచారణకు అతని వాయిస్ అవసరమైతే, ఏడు రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాలని న్యాయవాది చెప్పారు. భవిష్యత్తులో అలాంటి పని చేయవద్దని కోర్టు హెచ్చరించినట్లు రాణే న్యాయవాది చెప్పారు.

Read Also… Afghan crisis: మోకాలి లోతు డ్రైనేజీ నీటిలో నిలబడి.. తమను రక్షించాలంటూ కాబూల్ విమానాశ్రయం వద్ద ఆఫ్ఘన్ల దీనాలాపనలు