నాడు రూ.251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ ఊదరగొట్టి..ఇప్పుడు మళ్ళీ కటకటాల్లోకి.. ఎవరా ఛీటర్ .?

సుమారు నాలుగేళ్ల కిందటి మాట ! అతి చౌకగా..251 రూపాయలకే ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ లభిస్తుందంటూ గ్రేటర్ నోయిడాలో ఊదరగొట్టిన వ్యక్తి గుర్తున్నాడా ? 2017 లో ఇతని 'రింగింగ్ బెల్స్' అనే సంస్థ.. ఇంత చౌక ధరకు మొదట 251 మందికి ఈ స్మార్ట్ ఫోన్ ఇస్తామంటూ...

నాడు రూ.251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ ఊదరగొట్టి..ఇప్పుడు మళ్ళీ కటకటాల్లోకి.. ఎవరా ఛీటర్ .?
Mohit Goel Man Who Tried To Sell Freedom 251 Phone
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 25, 2021 | 7:34 PM

సుమారు నాలుగేళ్ల కిందటి మాట ! అతి చౌకగా..251 రూపాయలకే ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ లభిస్తుందంటూ గ్రేటర్ నోయిడాలో ఊదరగొట్టిన వ్యక్తి గుర్తున్నాడా ? 2017 లో ఇతని ‘రింగింగ్ బెల్స్’ అనే సంస్థ.. ఇంత చౌక ధరకు మొదట 251 మందికి ఈ స్మార్ట్ ఫోన్ ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసింది. దీని యజమాని మోహిత్ గోయెల్..ఇలా ఆ నాడు పతాక శీర్షికలకెక్కాడు. కానీ అసలు ఆ ఫోన్లను బుక్ చేసుకున్నవారికెవరికీ అవి అందలేదు.. ఇలా యాడ్ ఇచ్చాడో లేదో సుమారు 30 వేల బుకింగులు నమోదయ్యాయి. కానీ కస్టమర్లు తాము మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహిత్ గోయెల్ ని వారు అరెస్టు చేశారు. (కానీ తాము 5 వేల ఫోన్లను అమ్మామని ఇతని రింగింగ్ బెల్స్ కంపెనీ చెప్పుకుంది). అది నాటి మాట.. ఈ గోయెల్ మహాశయుడు మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకొచ్చాడు. 2018 లో ఓ బలవంతపు వసూళ్ల కేసులో పోలీసులకు పట్టుబడగా ..తాజాగా డ్రై ఫ్రూట్స్ బిజినెస్ వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించి అతనికి రూ. 41 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టాడట

ఢిల్లీలో వికాస్ మిట్టల్ అనే వ్యక్తికి ఈ బిజినెస్ విషయంలో సహకరిస్తామంటూ అతడిని చీట్ చేశాడట.. ఆ బిజినెస్ జరగకపోగా తానిచ్చిన డబ్బు విషయమై .అడిగేసరికి అతడిని గోయెల్ బెదిరించాడని తెలిసింది. పైగా ఈ నెల 19 న కారుతో ఢీ కొట్టించాడని, ఆ ప్రమాదంలో తాను గాయపడ్డానని మిట్టల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రేటర్ నోయిడాలోని గోయెల్ ఇంటిపై దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. ఇతనితో బాటు మరో అయిదుగురిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ప్రైవేటీకరణతోనే ఇండియా ముందుకెళ్తుందా.? Big News Big Debate Live Video.

తరుముకొస్తున్నథర్డ్ వేవ్..! హెచ్చరిస్తున్నా కేంద్ర ఆరోగ్య శాఖ..: Third Wave Of Coronavirus Live Video.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల…: TS EAMCET Result 2021 Live Video.

కన్నింగ్ లేడీ.. హనీట్రాప్ కేసులో కీలకం.. ముగ్గురి పేర్లతో ఒకే యువతి మోసం..:Honeytrap Case Video.