National Dope Testing: నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం పొందొచ్చు.
National Dope Testing Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన...
National Dope Testing Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 27-08-2021గా నిర్ణయించారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 08 ఖాళీలకు గాను సైంటిస్ట్ డీ (01), సైంటిస్ట్ సీ (01), సైంటిస్ట్ బీ(06) ఖాళీలను భర్తీ చేయనున్నారు. * సైంటిస్ట్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు డ్రగ్స్ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు. * ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.1,19,132 జీతం చెల్లిస్తారు. * సైంటిస్ట్ సీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు డ్రగ్స్ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి. ఎంపికై అభ్యర్థులకు నెలకు రూ. 1,03,881 జీతంగా చెల్లిస్తారు. అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు. * సైంటిస్ట్ బీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. డ్రగ్స్ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ. 87,525 జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ముందుగా అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * అభ్యర్థులు దరఖాస్తులను ది డిప్యూటీ డైరెక్టర్(అడ్మిన్), నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్) ఈస్ట్ గేట్ నెం.10, జేఎల్‌ఎన్ స్టేడియం కాంప్లెక్స్, లోథి రోడ్, న్యూఢిల్లీ–110003 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 27-08-2021గా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Weather Forecast: ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు.. తెలంగాణలో నేడు ఈ ప్రాంతాలలో భారీ వర్షం
Pizza Delivery: ఆయన ఓ మాజీ ఐటీ మంత్రి.. ఇప్పుడు సైకిల్ పై పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు!