Telangana Minister: మంత్రి కేటీఆర్ పెద్ద మనసు.. ఐఐటి విద్యార్థిని చదవు కోసం ఆర్థిక సాయం..
Minister KTR: సాయం కోరి వచ్చిన వారికి మంత్రి కేటీఆర్ అండగా ఉంటారని అందరికీ తెలిసిందే. నేరుగానే కాక.. సోషల్ మీడియా వేదికగానూ..
Minister KTR: సాయం కోరి వచ్చిన వారికి మంత్రి కేటీఆర్ అండగా ఉంటారని అందరికీ తెలిసిందే. నేరుగానే కాక.. సోషల్ మీడియా వేదికగానూ ప్రజలు తమ సమస్యను విన్నవించడమే ఆలస్యం ఆయన వెంటనే స్పందిస్తుంటారు. ఇలా ఎంతో మంది ప్రాణాలను కాపాడటమే కాక.. మరెందరో జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా డబ్బులు లేక ఉన్నత చదువుకు దూరం అవుతున్న ఓ యువతికి మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. తానున్నానంటూ.. భరోసా కల్పించడమే కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
వివరాల్లోకెళితే.. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలికి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కింది. అయితే, కాలేజీలో చేరేందుకు అవసరమైన డబ్బు వారి వద్ద లేదు. పేదరికం, ఆర్థిక సమస్యల నేపథ్యంలో చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితి నెలకొంది. దాంతో ఆమె నేరుగా మంత్రి కేటీఆర్‌ను ఆశ్రయించింది. సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కడు పేదరికంలో మగ్గుతున్నానని, తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరింది అంజలి. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. యువతి పరిస్థితిపై ఆరా తీశారు. యువతి చదువుకు అవసరమైన నిధులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత రెండు సంవత్సరాలుగా అంజలి చదువకు అవసరమైన ఫీజులను మంత్రి కేటీఆర్ చెల్లిస్తూ వస్తున్నారు.
కాగా, తాను ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది, వచ్చే ఏడాదికి సంబంధించిన ఫీజుల మొత్తాన్ని ఇవాళ మంత్రి కేటీఆర్.. విద్యార్థిని అంజలి కుటుంబానికి అందించారు. అంజలి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ సాయం చేయడంపై అంజలి, ఆమె కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. తమ కూతురు విద్యకు ఆర్థిక సాయం చేసిన కేటీఆర్‌కు అంజలి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Also read:
Big News Big Debate: ప్రైవేటీకరణతోనే ఇండియా ముందుకెళ్తుందా.? లైవ్ వీడియో..