Pizza Delivery: ఆయన ఓ మాజీ ఐటీ మంత్రి.. ఇప్పుడు సైకిల్ పై పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు!
విధి చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిని ఏ తీరానికి లాక్కెళుతుందో చెప్పడం చాలా కష్టం. ఎంత బతుకు బతికినా ఒక్కోసారి.. పరిస్థితులు తల్లకిందులైతే విచిత్రమైన జీవితం గడపాల్సి వస్తుంది.
Pizza Delivery: విధి చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిని ఏ తీరానికి లాక్కెళుతుందో చెప్పడం చాలా కష్టం. ఎంత బతుకు బతికినా ఒక్కోసారి.. పరిస్థితులు తల్లకిందులైతే విచిత్రమైన జీవితం గడపాల్సి వస్తుంది. అదే జరిగింది ఆఫ్ఘనిస్తాన్ మాజీ మంత్రి విషయంలో. ఆఫ్గనిస్తాన్ దేశంలో ఐటీ శాఖా మంత్రిగా పనిచేసిన ఒకాయన ప్రస్తుతం పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. ఆయన ఆఫ్గనిస్తాన్ మంత్రిగా ఉన్నప్పుడు తన దేశంలో సెల్ ఫోన్ నెట్ వర్క్ ను విస్తృతం చేశారు. అటువంటి మంత్రి మాజీ అయ్యాకా ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడం కోసం పిజ్జా డెలివరీ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఐటి మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్ జర్మనీలో పిజ్జాను విక్రయిస్తున్నారు. పిజ్జా కంపెనీ యూనిఫాం ధరించి, ఆయన జర్మనీలోని లీప్‌జిగ్ నగరంలో సైకిల్‌పై పిజ్జాను పంపిణీ చేస్తున్నారు. అతను ఐటి మంత్రిగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో సెల్ ఫోన్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించారు. ఆ తరువాత వారు ఆఫ్ఘనిస్తాన్ వదిలి జర్మనీకి వచ్చారు.
ఆఫ్ఘన్ మాజీ ఐటీ మంత్రి పిజ్జా డెలివరీ చేస్తున్న ఫోటోలు ఈ ట్వీట్ లో చూడొచ్చు..
وزير الاتصالات والتكنولوجيا الأفغاني السابق سيد أحمد سادات يلجأ لمهنة توصيل طلبات الطعام على متن دراجة هوائية في مدينة لايبزيغ الألمانية التي وصلها نهاية عام 2020، بعد تخليه عن منصبه pic.twitter.com/zfFERbqCmD
— قناة الجزيرة (@AJArabic) August 24, 2021
ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఘనీకి.. ఈయనకు మధ్య కొన్నఅంశాలపై వివాదం తలెత్తింది. అప్పట్లో ఆ వివాదాలు పెద్దగా మారడంతో అహ్మద్ షా తన పదవికి రాజీనామా చేశారు. తరువాత కొంతకాలం ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నారు. కానీ, అక్కడ ఉండలేని పరిస్థితిలో అయన జర్మన్ వలస వెళ్లిపోయారు. మొదట్లో కొంతకాలం బాగానే సాగింది. కానీ, తరువాత ఆయనకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆయన పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. డెలివరీ పని చేయడానికి తానేమీ సిగ్గుపడటం లేదని అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
తాలిబాన్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది
ఇక మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన అధికారికంగా మొదలైంది. తాలిబాన్ మంగళవారం తన తాత్కాలిక ప్రభుత్వానికి పలువురు మంత్రులను ప్రకటించింది. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఒకప్పుడు తాలిబాన్ యొక్క ప్రత్యర్థి అయిన గుల్ అఘా షెర్జాయ్ ని ఆర్థిక మంత్రిగా ఈ సంస్థ నియమించింది. షెర్జాయ్ కందహార్ మొదటి గవర్నర్..తరువాత నంగర్‌హార్. తాలిబన్లు తాత్కాలిక అంతర్గత మంత్రిగా సదర్ ఇబ్రహీం, తాత్కాలిక విద్యాశాఖ మంత్రిగా ముల్లా సఖౌల్లా మరియు ఉన్నత విద్యా మంత్రిగా అబ్దుల్ బారీని నియమించారు. సదర్ ఇబ్రహీంను తాత్కాలిక హోం మంత్రిగా చేశారు. అదే సమయంలో, ముల్లా షిరిన్‌ను కాబూల్ గవర్నర్‌గానూ, హమ్దుల్లా నోమానిని కాబూల్ మేయర్‌గా చేశారు.
Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తీవ్ర పోరాటం..50 మంది తాలిబన్ సైనికుల హతం..బందీలుగా 20 మంది!