Afghan crisis: ఈ-వీసా పైనే ఇండియాకు ఆఫ్ఘన్లు.. హోం శాఖ ఉత్తర్వుల జారీ.. పాత వీసాలకిక కాలం చెల్లు
ఆఫ్ఘన్ దేశస్థులందరూ ఇకపై ఈ-వీసా పైనే ఇండియాకు రావాలని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆఫ్ఘన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం అక్కడి భద్రతా పరమైన పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ఆఫ్ఘన్ దేశస్థులందరూ ఇకపై ఈ-వీసా పైనే ఇండియాకు రావాలని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆఫ్ఘన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం అక్కడి భద్రతా పరమైన పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఆఫ్ఘన్ ను వీడి రావాలనుకున్నవారికి ఈ వెసులుబాటు కల్పిస్తామని..మొదట హిందువులు, సిక్కులకు ప్రాధాన్యమిస్తామని ఇటీవల ఇండియా ప్రకటించింది. అయితే తాజాగా ఇకపై ఎమర్జెన్సీ వీసా తప్పనిసరి అని, పాత వీసాలిక చెల్లబోనని ఈ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఈ-ఎమర్జెన్సీ..ఎక్స్-ఎంఐఎస్సి వీసా అప్లికేషన్ ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ చేశామని..ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చే ఆఫ్ఘన్లు అందరికీ ఈ కొత్త వీసా తప్పనిసరి అని వారు పేర్కొన్నారు. పలువురి పాస్ పోర్టులు గల్లంతయినట్టు సమాచారం అందిందన్నారు.వీసా అప్లికేషన్ పోర్టల్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ-వీసా ఆరు నెలల బాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఆఫ్ఘన్లు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని అధికారులు ఆ అంటున్నారు. ఇలా ఉండగా ఆఫ్ఘన్ సంక్షోభం నేపథ్యంలో సీఏఏలో మార్పులు చేయాలని అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ కేంద్రాన్ని కోరారు. ఆఫ్ఘన్ నుంచి వస్తున్న హిందువులు, సిక్కుల పునరావాసానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మొదట ఇందుకు అనువుగా పౌరసత్వ సవరణ చట్టంలో కొన్ని మార్పులు చేయాలనీ ఆమె ప్రధాని మోడీకి.. హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.ఇండియాను వారు తమ మాతృభూమిగా పరిగణించేలా చూడాలన్నారు. అకాలీదళ్ ఇతర నేతలు కూడా ఇదే డిమాండును ప్రస్తావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తరుముకొస్తున్నథర్డ్ వేవ్..! హెచ్చరిస్తున్నా కేంద్ర ఆరోగ్య శాఖ..: Third Wave Of Coronavirus Live Video.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల…: TS EAMCET Result 2021 Live Video.
కన్నింగ్ లేడీ.. హనీట్రాప్ కేసులో కీలకం.. ముగ్గురి పేర్లతో ఒకే యువతి మోసం..:Honeytrap Case Video.