Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా థర్డ్‌ వేవ్ టార్గెట్ పిల్లలేనా...? థర్డ్‌ వేవ్ పై మరో స్టడీ.. ప్రధానికి కీలక రిపోర్ట్..: Third Wave Video.

కరోనా థర్డ్‌ వేవ్ టార్గెట్ పిల్లలేనా…? థర్డ్‌ వేవ్ పై మరో స్టడీ.. ప్రధానికి కీలక రిపోర్ట్..: Third Wave Video.

Anil kumar poka

|

Updated on: Aug 25, 2021 | 10:41 AM

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది..ఎప్పటికప్పుడూ తన రూపాలను మార్చుకుంటూ దాడి చేస్తోంది. భారత్‌లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తుండగా, భారీగా ప్రాణ నష్టం జరిగింది. కేంద్ర హోంశాఖ తాజాగా ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన కీలక నివేదికలో దేశవ్యాప్తంగా ధర్డ్ వేవ్...

సెకండ్ వేవ్ పెట్టిన భయానికి ధర్డ్ వేవ్ అంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పైగా, ధర్డ్ వేవ్ ఫస్డ్, సెకండ్ వేవ్ లకు భిన్నంగా పెద్దలపై కంటే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపబోతోందన్న హెచ్చరికలు తల్లితండ్రుల్ని నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే సెకండ్ వేవ్ తగ్గిందంటూ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు తెరిసేస్తున్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక విద్యార్ధుల తల్లితండ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది..ఎప్పటికప్పుడూ తన రూపాలను మార్చుకుంటూ దాడి చేస్తోంది. భారత్‌లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తుండగా, భారీగా ప్రాణ నష్టం జరిగింది. కేంద్ర హోంశాఖ తాజాగా ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన కీలక నివేదికలో దేశవ్యాప్తంగా ధర్డ్ వేవ్ ప్రభావం మొదలైందంటూ చేసిన హెచ్చరిక ఇప్పుడు దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న తరుణంలో ఎన్‌ఐడీఎమ్‌ తాజాగా బాంబ్‌లాంటి వార్త పేల్చింది.. అన్నింటికంటే మించి అంతా ఊహించినట్లుగానే ఇది పిల్లల్ని టార్గెట్ చేయబోతోందని ఈ నివేదిక హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా దూసుకొస్తున్న కోవిడ్ ధర్డ్ వేవ్ కచ్చితంగా పిల్లలపైనే ప్రభావం చూపబోతోందని ఎన్‌ఐడీఎమ్‌ నివేదికలో తెలిపింది. గతంలో ఫస్డ్ వేవ్, సెకండ్ వేవ్ ఎలాగైతే పెద్దలపై ప్రభావం చూపిందో అదే స్ధాయిలో ఇప్పుడు ధర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపబోతోందని ప్యానెల్ హెచ్చరించింది. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా మొదలుకాకపోవడంతో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండబోతోందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి పిల్లల్ని కాపాడేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టాలని సూచించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Kohli Drinking Water Video: కోహ్లీ తాగే నీళ్ల బాటిల్‌ ధర ఎంతో తెలుసా..?వామ్మో ఇంత ధరనా..?

స్పైడర్ మంకీని ఎప్పుడైనా చూశారా..! వైరల్ అవుతున్న వీడియో..:Spider Monkey video.

 రఘువీరారెడ్డిని ఫాలో అవుతున్న దేశ నాయకులు.. పొలం బాట పట్టిన ఆ రాష్ట్ర మాజీ సీఎం..:Former CM Farming Video.

ఏం హైట్‌రా.. లంబుగా..! వరుణ్ తేజ్ , మెగాస్టార్ మధ్య వైరల్ ఫన్నీ విజువల్..:Varun Tej and Chiranjeevi Funny video.