Pocharam Srinivas Reddy: సిక్స్‌ కొట్టిన అసెంబ్లీ స్పీకర్‌.. చిచ్చర పిడుగులతో బ్యాటింగ్‌.. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన పోచారం..

తెలంగాణ శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. గల్లీ క్రికెటర్‌గా మారిపోయారు. ఓ గల్లీలో క్రికెట్‌ ఆడుతున్న చిన్నారులను చూసి కారు దిగిన ఆయన.. వెంటనే బ్యాట్‌ అందుకుని సిక్స్‌లు బాదేశారు.

Pocharam Srinivas Reddy:  సిక్స్‌ కొట్టిన అసెంబ్లీ స్పీకర్‌.. చిచ్చర పిడుగులతో బ్యాటింగ్‌.. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన పోచారం..
Pocharam Srinivas Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 25, 2021 | 7:51 PM

Pocharam Srinivas Reddy: తెలంగాణ శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. గల్లీ క్రికెటర్‌గా మారిపోయారు. ఓ గల్లీలో క్రికెట్‌ ఆడుతున్న చిన్నారులను చూసి కారు దిగిన ఆయన.. వెంటనే బ్యాట్‌ అందుకుని సిక్స్‌లు బాదేశారు. పిల్లలతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి.

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వీలు చిక్కితే చాలు చిన్నపిల్లాడిలా మారిపోతారు. స్పీకర్ పోచారం బుధవారం బాన్సువాడ మండలంలోని తన స్వగ్రామం పోచారం వెళ్లి వస్తున్నారు. తన స్వగ్రామం పోచారం నుంచి బాన్సువాడకు వెళ్లున్న స్పీకర్ శ్రీనివాస్‌ రెడ్డికి.. మార్గం మధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులు కనిపించారు. తన కాన్వాయ్‌ ఆపి.. పిల్లలను పలకరించిన స్పీకర్.. ఆ తర్వాత క్రికెటర్‌ అవతారం ఎత్తారు. సరదాగా చిన్నారులతో బ్యాటింగ్‌కు దిగారు. తన హోదాను పక్కనపెట్టి మరీ ఉత్సాహంతో స్పీకర్ పోచారం పిల్లలతో క్రికెట్ ఆడారు. ఓ బుడ్డోడు బౌలింగ్‌ చేస్తే.. ఆ బంతిని కాస్త సిక్సర్‌ మిలిచి, కాసే ఎంటర్‌టైన్‌ చేశారు స్పీకర్‌. ఈ సీన్‌ చూసిన నెటిజన్స్‌.. బ్యాటింగ్‌తో అదరగొట్టారు కదా.. సర్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Read Also…