AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram : విజయనగరం ఏజెన్సీలో వింత ఆచారం..వర్షాలు కురవాలని ఇలా చేస్తారట..

విజయనగరం ఏజెన్సీలో వింత ఆచారం అందరిని ఆశ్చర్యపరిస్తుంది.. పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తున్న ఆచారంను పాటించటం వల్లే వర్షాలు కురుస్తున్నాయని నమ్ముతున్నారు అక్కడివారు...

Vizianagaram : విజయనగరం ఏజెన్సీలో వింత ఆచారం..వర్షాలు కురవాలని ఇలా చేస్తారట..
Rajeev Rayala
|

Updated on: Aug 25, 2021 | 12:01 AM

Share

Vizianagaram : విజయనగరం ఏజెన్సీలో వింత ఆచారం అందరిని ఆశ్చర్యపరిస్తుంది.. పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తున్న ఆచారంను పాటించటం వల్లే వర్షాలు కురుస్తున్నాయని నమ్ముతున్నారు అక్కడివారు.. వరుణ దేవుడు కరుణ కోసం వింత ఆచారాలతో ఉదయం పూజలు చేసిన గ్రామస్తులకు అనుకున్నట్లే సాయంత్రంకి వర్షం దంచికొట్టింది.. దింతో చుట్టుప్రక్కల గ్రామాల వారు సైతమ్ ఆచారాన్ని నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది.. ఇంతకీ అక్కడి వారు ఆచరిస్తున్న ఆ వింత ఆచారం ఏంటి? ఆందరిని ఆశ్చర్యంకి గురిచేస్తున్న ఆ సంప్రదాయం ఎలా సాగుతోంది? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇది విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట.. ఈ గ్రామమ0లో రైతులు ఎక్కువగా ఉంటారు.. ఇక్కడ పంటలు పండాలంటే వర్షమే ఆధారం.. ప్రతిఏటా పొలాల్లో పంట వేసే ముందు ఈ గ్రామ దేవత జాకరమ్మ కు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు మొక్కటం సంప్రదాయం.. అంతే కాకుండా ఈ గ్రామానికి ఒక వింత ఆచారం ఉంది.. ఈ గ్రామం నుండి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పై వెలిసిన జాకరమ్మ అమ్మవారి వద్దకు ఊరంతా ఊరేగింపుతో వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు.. ప్రతి ఇంట్లో వారి స్థోమతకు తగ్గట్టు అమ్మవారికి సారె, చీర, గాజులు, పసుపుకుంకుమ అందజేస్తారు.. అంతేకాకుండా ప్రతి ఇంటి నుండి కోడి, మేక, గొర్రెపోతు ఇలా ఎవరికి నచ్చిన జంతువులను వారు అమ్మవారికి బలిచ్చి తమ కోరికలు కోరుకుంటారు.. వర్షాలు బాగా కురిపించాలని, తమ పంటలు సమృద్ధిగా పండి సిరిసంపదలు ఇవ్వాలని కోరతారు.. అనంతరం ఆలయ పూజారి ఒక కుండీలో పాయసం వండి అమ్మవారికి నైవేద్యం గా పెడతాడు.. తరువాత ఆ పాయసంను ప్రతి కుటుంబసభ్యులకు ఒక్కో చోట నేల మీదే ప్రసాదంగా ఇస్తాడు.. ఆ నైవేద్యంను చేతితో కాకుండా నేరుగా నాలుకతో సేవించటమే వీరి ఆచారంలో ప్రత్యేకత.. అలా నైవేద్యం సేవించి అందరూ కలిసి ఆనందంగా ఇంటికి చేరుకుంటారు.. అలా ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే వర్షం దంచికొడుతుంది.. దింతో తమను అమ్మ అనుగ్రహించిందని, తమకు వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండుతాయని ఆనందంలో మునిగితేలి పొలాల్లో పనులు ప్రారంభిస్తారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో కట్టప్ప, ఒకప్పుడు తాలిబన్ కసాయి.. ఇప్పుడు వారికి ఆప్తమిత్రుడు..

Hyderabad: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డీజీగా అనిల్ కుమార్..

Adilabad: అడవి తల్లుల గోస.. ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం.. టీవి9 వరుస కథనాలకు స్పందన..