Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇవేంటిరా ఇంత శ్రద్ధగా దాడి చేశాయి..అతడు సినిమా డైలాగ్‌ను గుర్తు చేసిన మొసలి.. ఇది చూసిన నెటిజన్లు షాక్..

అడవిలో చిరుత.. మొసలి రెండూ ప్రమాదకరమైన జంతువులే.. అవి చేసే దాడి అంతే భయంకరంగా ఉంటాయి. వాటి వేట కూడా అదే స్థాయిలో ఉంటుంది.

Viral Video: ఇవేంటిరా ఇంత శ్రద్ధగా దాడి చేశాయి..అతడు సినిమా డైలాగ్‌ను గుర్తు చేసిన మొసలి.. ఇది చూసిన నెటిజన్లు షాక్..
Cheetah Its Prey
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 25, 2021 | 8:45 AM

‘ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక.. గోడ కడుతున్నట్టు! గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు! చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడ్రా’ ..‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన ఈ డైలాగ్‌ గుర్తుందా? అచ్చు ఇలాంటి డైలాగ్ మీకు మరోసారి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూసే వీడియో అలాంటిది. తాజాగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియో అచ్చు అలాంటిదే.. ఈ వీడియోను చూస్తే మీరు కూడా డైలాగ్ రిపీట్ చేస్తారు. అడవి ప్రశాంతంగా ఉంటే.. మరి కాసేపట్లో అంతే భయంకరంగా మారుతుంద అర్థం. అది క్రూర మృగాలకు నెలవు.. అక్కడ ఏ జంతువు ఎక్కడి నుంచి ఎలా దాడి చేస్తాయో ఊహించడం చాలా కష్టం.

అడవిలో చిరుత.. మొసలి రెండూ ప్రమాదకరమైన జంతువులే.. అవి చేసే దాడి అంతే భయంకరంగా ఉంటాయి. వాటి వేట కూడా అంతే వాయిలంట్‌గా ఉంటుంది. అవి దాడి చేస్తే చావు నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఒకరిని నేలపై, మరొకటి నీటిలో ఢీకొట్టడం ఎవరి తరం కాదు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శక్తివంతమైనది? ఈ ప్రశ్నకు ఎవరైనా  సమాధానం చెప్పలేరు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఈ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో అకస్మాత్తుగా చిరుతపై మొసలి దాడి చేసింది. దీనిలో చిరుత చాలా జాగ్రత్తగా నీటిని తాగుతోంది. అయితే అటుగా వస్తున్న బాతును వేటాడేందుకు ప్రయత్నించేందుకు ప్లాన్ చేస్తుంది. కానీ అదే సమయంలో అది ఓ పెద్ద చిక్కులు చిక్కుంటుంది. నీటిలోని ‘అలెగ్జాండర్’ ప్రవేశంతో ఆట మొత్తం తిరగబడింది.

వీడియోలో మీరు ఒక సరస్సులో ఒక బాతు సరదాగా ఉండటాన్ని మనం ముందుగా చూడవచ్చు. మరోవైపు, చిరుత నీరు తాగుతోంది. తనకు దగ్గరగా వస్తున్న పక్షి రాకను చిరుత గమనిస్తుంది. అదే సమయంలో ఆ బాతుపై చాలా మొసళ్ల దాడి చేయడంను చూస్తుంది చిరుత. బాతుపై దాడి చేసిన సమయంలోనే మరో మొసలు చిరుతపై దాడి చేయడం మనం చూడవచ్చు. దాడి జరుగుతుందని చిరుత అర్థం చేసుకునే లోపు అంతా జరిగిపోతుంది. ఒక మొసలి చిరుత మెడను పట్టుకుని నీటిలోకి లాగేస్తుంది.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ షేర్ చేస్తున్నారు యూజర్లు. ఈ వీడియోపై చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన ఓ యూజర్ మాత్రం  కొంత ఆసక్తికరంగా స్పందించాడు. అడవిలో చట్టం నిజంగా అద్భుతమైనది. అని రాసుకొచ్చాడు. ఈ వీడియో లైఫ్ అండ్ నేచర్ అనే ట్విట్టర్ ఖాతాతో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి: దిల్ మాంగే మోర్.. రిస్క్ ఎలాంటిదైనా ఇవి ఉండాల్సిందే.. కేబుల్ నుంచి భారతీయుల తరలింపులో వీటిదే కీ రోల్..