Puttur: పెద్ద కొడుకు అప్పు చేసి భార్యతో పారిపోయాడు.. అవమానం, బాధ తట్టుకోలేక మిగిలిన కుటుంబమంతా

చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలో ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు సామూహిక బలవన్మరణానికి పాల్పడ్డారు.  మునిసిపాలిటీ పరిధిలోని...

Puttur: పెద్ద కొడుకు అప్పు చేసి భార్యతో పారిపోయాడు.. అవమానం, బాధ తట్టుకోలేక మిగిలిన కుటుంబమంతా
Family Suicide
Follow us

|

Updated on: Aug 26, 2021 | 9:37 AM

చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలో ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు సామూహిక బలవన్మరణానికి పాల్పడ్డారు.  మునిసిపాలిటీ పరిధిలోని రాజుపాలెంలో ఈ విషాదం జరిగింది.  అప్పుల బాధతో వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. పెద్ద కుమారుడు చేసిన అప్పు ఆ కుటుంబాన్ని బలి తీసుకుందని స్థానికులు చెబుతున్నారు. రూ. కోటిన్నరకు పైగా చేసిన అప్పు తీర్చకపోగా.. బాధ్యత లేకుండా భార్యను తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు తీర్చాలని ఒత్తిడి చేశాడు.. తల్లి, తండ్రి, మరో కుమారుడిని నిలదీశాడు. కొందరు పరుష పదజాలం ఉపయోగించారు. అవమానం, బాధ, తలకు మించిన అప్పు తీర్చలేని నిస్సహాయత ఆ ముగ్గురిని మానసికంగా కుంగదీసింది. ఇక తమకు చావే గతి అనుకున్న వాళ్లు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు శంకరయ్య(55), గురవమ్మ(45), వినయ్‌(25)గా పోలీసులు గుర్తించారు.  పెద్ద కుమారుడు సతీష్..తెలిసిన అందరి దగ్గర అప్పులు తీసుకున్నాడు. ఆ అప్పు సుమారు రూ. కోటిన్నర అయ్యింది. తిరిగి అడిగేసరికి భార్యతో కలిసి పారిపోయాడు. అప్పులు ఇచ్చిన వారు కుటుంబాన్ని నిలదీయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు చెబుతున్నారు.

కొద్ది గంటల్లో పెళ్లనగా…పెళ్లికూతురు ఎస్కేప్

కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. సినీ ఫక్కీలో పెళ్లి పందిరి నుంచి పెళ్లికూతురు ఎస్కేప్ అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు(26), తంబళ్ళపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఇరు కుటుంబాల వారు చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చి అమ్మచెరువు దగ్గర్లోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహానికి ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లికుమార్తె రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా ఎస్కేప్ అయ్యింది. తమకు అవమానం జరిగిందని పెళ్లి కొడుకు, బంధువులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పెళ్లికూతురు మైనర్‌ అని తేలింది.

Also Read: ఏపీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ.. బద్వేలులో ప్లాంట్‌.. 9 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఉపశమనం..! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం