AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shalini Pandey: అర్జున్‌ రెడ్డికి నేను రుణపడి ఉంటాను.. ఆ క్రెడిట్‌ అంతా ఆయనదే. షాలిని ఆసక్తికర వ్యాఖ్యలు.

Shalini Pandey: ఓ అబ్బాయి అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు.. కానీ కులం కారణంగా అమ్మాయి తరుఫు బంధువులు వివాహానికి అడ్డు చెబుతారు. దీంతో పిచ్చోడిలా మారిన అబ్బాయి తాగుడుకి...

Shalini Pandey: అర్జున్‌ రెడ్డికి నేను రుణపడి ఉంటాను.. ఆ క్రెడిట్‌ అంతా ఆయనదే. షాలిని ఆసక్తికర వ్యాఖ్యలు.
Narender Vaitla
|

Updated on: Aug 26, 2021 | 10:04 AM

Share

Shalini Pandey: ఓ అబ్బాయి అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు.. కానీ కులం కారణంగా అమ్మాయి తరుఫు బంధువులు వివాహానికి అడ్డు చెబుతారు. దీంతో పిచ్చోడిలా మారిన అబ్బాయి తాగుడుకి అలవాటు పడతాడు… సింపుల్‌గా చెప్పాలంటే ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా కథ ఇదే. గతంలోనూ ఇలాంటి కథాంశంతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అర్జున్‌ రెడ్డి మాత్రం ఒక సంచలనం. ఏకంగా మూడు గంటలకుపైగా నిడివి ఉన్నా ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి మరీ ఈ సినిమాను చూశారు. ఎమోషన్‌, హీరో డైలాగ్స్‌, పాటలు ఇలా సినిమాలోని ప్రతీ అంశాలకు ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. అందుకే అర్జున్‌ రెడ్డి ఆ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై బుధవారం (ఆగస్టు 25) నాటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి.

Arjun Reddy

ఈ సినిమా విజయ్‌ దేవరకొండకు ఎలాంటి టర్నింగ్‌ ఇచ్చిందో.. హీరోయిన్‌గా నటించిన షాలిని పాండేకు కూడా అంతటి సక్సెస్‌ను అందించింది. ఈ సినిమా తర్వాత షాలిని వరుస అవకాశాలను సొతం చేసుకుంది. తాజాగా అర్జున్‌ రెడ్డి విడుదలై నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో షాలిని ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ సందీప్‌ రెడ్డి వంగాకే దక్కుతుందని షాలిని చెప్పుకొచ్చింది.

అర్జున్‌ రెడ్డికి తాను ఎప్పటికీ రుణ పడి ఉంటానని తెలిపిందీ బ్యూటీ. తనకు అర్జున్‌ రెడ్డి సినిమా ఒక మ్యాప్‌లా పనిచేస్తుందని తెలిపిన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో తాను తన స్థాయికి మించి ఉత్తమ నటన కనబరిచే ప్రయత్నం చేశానంది. ఇక ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తించినందుకు చాలా సంతోషం వేసిందని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుందీ బ్యూటీ.

Also Read: Eye Care: కంటి చూపు మందగించకుండా ఇలా ప్లాన్ చేసుకోండి.. వీటితో మీ కళ్లకు ఎంతో మేలు..

Samantha: సమంత తన పేరు నుంచి అక్కినేని పదాన్ని ఎందుకు తొలగించింది.. మొదటిసారి ఓపెన్‌ అయిన సామ్‌.

Boyapati Srinu : అఖండ తర్వాత బోయపాటి సినిమా చేసేది ఆ యాక్షన్ హీరోతోనేనా..?