AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత తన పేరు నుంచి అక్కినేని పదాన్ని ఎందుకు తొలగించింది.. మొదటిసారి ఓపెన్‌ అయిన సామ్‌.

Samantha: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార సమంత. నాగ చైతన్యతో వివాహం తర్వాత తెలుగు వారి కోడలిగా మారిన సామ్‌..

Samantha: సమంత తన పేరు నుంచి అక్కినేని పదాన్ని ఎందుకు తొలగించింది.. మొదటిసారి ఓపెన్‌ అయిన సామ్‌.
Narender Vaitla
|

Updated on: Aug 26, 2021 | 9:38 AM

Share

Samantha: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార సమంత. నాగ చైతన్యతో వివాహం తర్వాత తెలుగు వారి కోడలిగా మారిన సామ్‌.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కేవలం సినిమాలే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది ఆ రంగంలో కూడా బాగానే రాణిస్తోంది. ఇదిలా ఉంటే నిత్యం సినిమాలతో బిజీగా ఉండే సమంత సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో సమంత చుట్టూ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ కూడా చక్కర్లు కొడుతూ ఉంటుంది. గతకొన్ని రోజులుగా సమంత విషయంలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. అదే సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్‌ పేరులో మార్పులు చేయడమే.

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

నాగ చైతన్యను వివాహమాడిన తర్వాత సమంత.. తన ప్రొఫైల్‌ నేమ్‌ను అక్కినేని సమంతగా మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం సామ్‌.. తన పేరులోని అక్కినేని పదాన్ని తొలగించి కేవలం ‘ఎస్‌’ అనే అక్షరాన్ని మాత్రమే ఉంచింది. దీంతో గాసిప్‌ రాయుళ్లకు పండగలాంటి వార్త దొరికింది. దీనిపై వరుసగా పలు కథనాలు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేశాయి. సమంత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయా అన్నంత వరకు విషయం వెళ్లింది. అయితే దీనిపై సమంత ఒక్కసారి కూడా స్పందించలేదు. ఇదిలా ఉంటే తొలిసారి సమంత ఈ విషయంపై అధికారికంగా స్పందించింది. తన పేరులో చేసిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. తన చుట్టూ ఏర్పడ్డ వివాదాల గురించి తనకు నచ్చినప్పుడే మాట్లాడతానని చెప్పిన సమంత.. ఇలాంటి విషయాలపై తాను ఇప్పుడు స్పందించాలనుకోవడం లేదని తేల్చి చెప్పింది.

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

తనకు వివాదాలు నచ్చవని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఎవరికైనా వారి స్వంత అభిప్రాయాలకు ఎలా అర్హత ఉంటుందో, తనకు కూడా తన హక్కుకు అర్హత కలిగి ఉంటుందని తెలిపింది. సమంత ఇంకా మాట్లాడుతూ.. ‘అక్కినేని కుటుంబంలో భాగం కావ‌డం వల్ల క‌ఠినంగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు క‌దా. ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నా.. అభిమానుల కోసమే నేను సినిమాలు చేస్తానని కూడా ఎప్పుడూ చెప్పలేదు. నచ్చినవి చేసుకుంటూ వెళుతున్నా’ అంటూ వ్యాఖ్యానించింది సామ్‌. మరి సమంత ఇచ్చిన ఈ క్లారిటీతో గాసిప్‌ రాయుళ్లు ఆగుతారా.? లేదా ఈ వివాదాన్ని ఇంకా కొనసాగిస్తారా.? చూడాలి.

Also Read: Aishwarya Rai: అచ్చం శివగామిలాగే ఐశ్వర్యా రాయ్.. నెట్టింట్లో హల్‏చల్ చేస్తోన్న ఐష్ న్యూలుక్.. చూస్తే ఫిదా కావాల్సిందే..

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..

మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు… టాలీవుడ్ సెలబ్రెటీలకు ఈడీ సమన్లు.. విచారణకు రావాలని ఆదేశాలు..